Independence Day 2021: దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకుంటోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసినవారిని దేశం స్మరించుకుంటోందన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ వ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు(Independence day celebrations) అత్యంత ఘనంగా, కోవిడ్ నిబంధనల మధ్య ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో శత్రుదుర్బేధ్యంగా మారిన ఎర్రకోట వేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముందుగా రాజ్‌ఘాట్‌లోని మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించి..అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రధాని హోదాలో మోదీ (Pm Narendra modi) 8వసారి జెండా ఎగురవేశారు. అనంతరం త్రివిధ దళాల నుంచి సైనిక వందనం స్వీకరించారు. వైమానిక దళ హెలీకాప్టర్లు ఆకాశం నుంచి పూలవర్షం కురిపించారు. జెండా ఆవిష్కరణ అనంతరం దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు అందించారు. స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన త్యాగధనుల్ని దేశం స్మరించుకుంటోందన్నారు. దేశ సరిహద్దుల్లో పగలూ రాత్రి తేడా లేకుండా పహారా కాస్తున్న వీరజవాన్లకు ప్రణామాలు అర్పించారు ప్రధాని మోదీ. కరోనా మహమ్మారిపై వైద్యులు, సిబ్బంది చేసిన సేవలు ఎనలేనివని కీర్తించారు. ఒలింపిక్స్‌(Olympics)లో భారత అథ్లెట్లు సత్తా చాటారాని..పతకాలు సాధించినవారంతా స్ఫూర్తి అని మోదీ చెప్పారు. 


Also read: Partition Day: ఆగస్టు 14వ తేదీ..ఇక నుంచి విభజన స్మృతి దివస్, ప్రధాని మోదీ కీలక ప్రకటన


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook