India's first-ever driverless train operations | న్యూఢిల్లీ: దేశంలో మొట్టమొదటి డ్రైవర్‌ రహిత మెట్రో రైలును, విమానాశ్రయ ఎక్స్‌ప్రెస్ లైన్‌లో నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ సర్వీస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ సేవలను ప్రారంభించారు. ఢిల్లీ మెట్రో కార్పోరేషన్‌లోని మెజెంటా లైన్‌లో తొలి డ్రైవర్‌ రహిత రైలు (driverless train) కు ఆయన ప్రధాని పచ్చజెండా ఊపి ప్రారంభించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మాట్లాడుతూ.. ఈ సేవలు భారతదేశ అభివృద్ధికి మరింత దోహదపడతాయని పేర్కొన్నారు. నగరీకరణ సవాల్‌గా కాకుండా అవసరంగా భావిస్తున్నామని.. దీనికోసం ఏకీకృత సాంకేతిక విధానాలను అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి సేవల ద్వారా.. ప్రజల జీవితాలు మెరుగుపడుతాయని, నగరం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. 


ఈ డ్రైవర్ రహిత మెట్రో రైలు ఢిల్లీ కార్పోరేషన్ (DMRC)‌లోని మెజెంటా లైన్‌లో జనక్‌పురి వెస్ట్‌-బొటానికల్‌ గార్డెన్‌ మధ్య మొత్తం 37 కిలోమీటర్ల మేర నడవనుంది. 2021 మధ్యనాటికి ఢిల్లీ మెట్రోలోని 57 కిలోమీటర్ల పింక్‌ లైన్‌లో కూడా ఈ సర్వీసులు ప్రారంభంకానున్నాయి. Also Read: Covid-19: ఇదే చివరి మహమ్మారి కాదు: WHO


అయితే ఎన్‌సీఎంసీ (NCMC) కార్డు ద్వారా ప్రయాణం చాలా సులభంగా అవుతుంది. రుపే, డెబిట్ కార్డు స్వైప్ చేసి ఎక్స్‌ప్రెస్ లైన్‌లో ప్రయాణీకులు ప్రయాణించవచ్చు. అయితే ఈ విధానాన్ని 2022 నాటికి ఢిల్లీ (Delhi) మొత్తంలో అమలు చేసేందుకు డీఎంఆర్‌సీ (Delhi Metro Rail Corporation) ప్రణాళికలు చేస్తోంది. Also Read: Rajinikanth: రజినీకాంత్‌కు అస్వస్థత, అపోలో ఆసుపత్రిలో చేరిక



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook