PM Narendra Modi lays foundation stone of new Parliament building: న్యూఢిల్లీ: పార్లమెంట్‌ నూతన భవనానికి ( New Parliament Building ) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( PM Narendra Modi ) శంకుస్థాపన చేశారు. గురువారం మధ్యాహ్నం 12.50 నిమిషాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రధాని మోదీ పునాది రాయి వేశారు. ఈ సందర్భంగా పలు పూజలు నిర్వ‌హించిన అనంతరం న‌వ క‌ల‌శ స్థాప‌న త‌ర్వాత శంకుస్థాప‌న చేశారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అత్యంత ఘనంగా జరిగిన ఈ శంకుస్థాన కార్య‌క్ర‌మానికి పార్లమెంట్ నూతన భవన నిర్మాణ కాంట్రాక్టు దక్కించుకున్న టాటా సంస్థల అధినేత ర‌త‌న్ టాటా సైతం హాజ‌ర‌య్యారు. లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, కేంద్ర మంత్రులు, పలు పార్టీల ప్రముఖులు హాజరయ్యారు. Also read: CM KCR: ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ



971 కోట్ల ఖ‌ర్చుతో సెంట్ర‌ల్ విస్టా కొత్త పార్ల‌మెంట్ భవనాన్ని అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించ‌నున్నారు. 2022, అక్టోబరు నాటికి ఇది పూర్తి కానున్న‌ది. 1,224 మంది ఎంపీలు కూర్చునేందుకు వీలుగా ఈ భవనాన్ని నిర్మించనున్నారు. 


Also read: New Parliament Building: కొత్త సౌధానికి 10న పూనాది రాయి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook