New Parliament Building: కొత్త సౌధానికి 10న పూనాది రాయి

పార్లమెంట్‌ నూతన భవనం (new parliament building) శంకుస్థాపనకు ముహూర్తం ఖారారైంది. ఈ నూతన సౌధం నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi ) ఈ నెల 10న భూమిపూజ చేయనున్నారు.

Last Updated : Dec 6, 2020, 09:02 AM IST
New Parliament Building: కొత్త సౌధానికి 10న పూనాది రాయి

New Parliament Building: న్యూఢిల్లీ: పార్లమెంట్‌ నూతన భవనం (new parliament building) శంకుస్థాపనకు ముహూర్తం ఖారారైంది. ఈ నూతన సౌధం నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( PM Narendra Modi ) ఈ నెల 10న భూమిపూజ చేయనున్నారు. రూ.970 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ భవనం 2022 అక్టోబరు నాటికి పూర్తవుతుందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Lok Sabha Speaker Om Birla ) శనివారం తెలిపారు. 10వ తేదీన మధ్యాహ్నం ఈ కొత్త భవనానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఓం బిర్లా ప్రధాని నివాసానికి వెళ్లి అధికారికంగా మోదీని ఆహ్వానించారు. అనంతరం నూతన భవనానికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. 

2022లో స్వాతంత్ర్యం దినోత్సవ 75వ (75 years of India’s independence) వార్షికోత్సవం సందర్భంగా.. కొత్త పార్లమెంట్ భవనం ( New Parliament) లో సమావేశాలను ఏర్పాటు చేసుకుంటామని ఓం బిర్లా తెలిపారు.  కొత్త భవనం భూకంపాలను తట్టుకునేలా ఉంటుందని ఓం బిర్లా తెలిపారు. దీంట్లో 1,224 మంది ఎంపీలు కూర్చునేందుకు వీలుంటుందని వెల్లడించారు. పాత పార్లమెంటు భవనానికి ఏమాత్రం తీసిపోకుండా కొత్త భవనం అన్ని వసతులతో సౌకర్యవంతంగా ఉంటుందని ఓం బిర్లా పేర్కొన్నారు. భారతదేశ భిన్న సంస్కృతులకు ప్రతిరూపంగా కొత్త భవనాన్ని నిర్మిస్తున్నామని.. దీనిని మనమే నిర్మించుకోవటం ప్రతి భారతీయుడికి గర్వకారణమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ భవనం శంకుస్థాపనకు అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానాలు పంపామని ఓం బిర్లా తెలిపారు. Also read: New Parliament Building: ప్రతిష్ఠాత్మక కాంట్రాక్టు టాటా సంస్థ కైవసం

ప్రస్తుతం ఉన్న పార్లమెంటు భవనాన్ని నిర్మించి దాదాపు వందేండ్లు పూర్తి కావస్తుండటంతో.. పార్లమెంట్ ( Parliament ) సమావేశాల కోసం కొత్త భవనాన్ని నిర్మించాలని ఎన్డీఏ సర్కారు ఈ ఏడాది ప్రారంభంలో నిర్ణయించింది. పార్లమెంట్ హౌస్ ఎస్టేట్‌లో 60 వేల చదరపు మీటర్ల భారీ విస్తీర్ణంలో నిర్మితం కానున్న ఈ నూతన భవన నిర్మాణ (parliament building) ప్రాజెక్టు కాంట్రాక్టును ప్రముఖ దేశీయ కంపెనీ టాటా సంస్థ ( Tata projects ) దక్కించుకుంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు రెండు అంతస్తులతో త్రిభుజాకారంగా దీన్ని నిర్మించనున్నారు. Also read: Farmer protests: చర్చలు మళ్లీ విఫలం.. 9న మరోసారి భేటీ

Also read: Shraddha Das: ఫొటోలతో హీటెక్కిస్తున్న శ్రద్ధా దాస్

Also read: Rashmika Mandanna: కాటుక కళ్లతో కవ్విస్తున్న రష్మిక..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News