Big Breaking: రామమందిర భూమిపూజకు ప్రధాని నరేంద్ర మోదీ?
ప్రతిష్టాత్మక రామ జన్మభూమి ఆలయంపై బ్రేకింగ్ న్యూస్ ఇది. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామాలయం నిర్మాణానికి భూమిపూజ చేయనున్నట్టు విశ్వసనీయం సమాచారం లభిస్తోంది.
ప్రతిష్టాత్మక రామ జన్మభూమి ఆలయంపై బ్రేకింగ్ న్యూస్ ఇది. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామాలయం నిర్మాణానికి భూమిపూజ చేయనున్నట్టు విశ్వసనీయం సమాచారం లభిస్తోంది.
వివాదాస్పద రామజన్మభూమిపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన 8 నెలల అనంతరం రామాలయ భూమి పూజ విషయంలో స్పష్టత వస్తోంది. కోర్టు సూచనల మేరకు ఇప్పటికే రామ జన్మభూమి నిర్మాణ ట్రస్ట్ ఏర్పడింది. పనులు ఓవైపు సాగుతున్నాయి. అయితే అయోధ్యలోని సాధువులు గానీ, ట్రస్ట్ కమిటీ గానీ అందరూ అయోధ్యలోని ప్రతిష్టాత్మక రామాలయ నిర్మాణానికి భూమిపూజను ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిపించాలని సంకల్పించారు. కోవిడ్ 19 వైరస్, లాక్ డౌన్ కారణాలతో దీనిపై స్పష్టత రాలేదు.
అయితే ఇప్పుడు ఈ విషయమై స్పష్టత వస్తోంది. అయోధ్యలోని రామాలయం నిర్మాణానికి భూమిపూజకు హాజరవడంపై ప్రధాని కార్యాలయం నుంచి అధికారికంగా ఏ విధమైన సంకేతాలు రాలేదు. కానీ ఈ ప్రధాని హాజరుకావచ్చని..అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఎప్పుడనేది మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ విషయమై అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ తో పాటు సాధుసంతువులకు సూచనలు అందినట్టు సమాచారం అందినట్టు తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే ప్రదాని నరేంద్ర మోదీ చేతుల మీదుగానే రామాలయ నిర్మాణానికి భూమి పూజ జరిగే అవకాశాలున్నట్టు నిర్ధారణ అవుతోంది. Also read: GGH Kakinada Jobs 2020: కాకినాడ ప్రభుత్వ ఆసుప్రతిలో ఉద్యోగ అవకాశాలు