PM Modi Mother Heeraben Dies at 100: ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బుధవారం ఉదయం అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో ఆమె చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తల్లి మరణంపై ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ.. ''దేవుడి పాదాల వద్ద అద్భుతమైన శతాబ్ధం ఉంది. సన్యాసి జీవితం, నిస్వార్థ కర్మయోగి, విలువలకు కట్టుడి ఉండే జీవితం వంటి త్రిమూర్తి లక్షణాలు అమ్మలో ఉన్నాయి. 100వ పుట్టిన రోజు సందర్భంగా నేను అమ్మను కలిసినప్పుడు ఆమె ఓ విషయం చెప్పింది. తెలివితో పని చేయండి, స్వచ్చతతో జీవించండి అని చెప్పారు. ఆ విషయాన్ని నేను ఎప్పుడు గుర్తుంచుకుంటాను.'' అని రాసుకొచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


1923 జూన్ 18న జన్మించిన హీరాబెన్ మోదీ స్వస్థలం గుజరాత్‌లోని మెహసానాలోని వాద్‌నగర్. ఆమెకు ఐదుగురు కుమారులు. ప్రధాని నరేంద్ర మోదీ, పంకజ్ మోదీ, సోమ మోదీ, అమృత్ మోదీ, ప్రహ్లాద్ మోదీ. ఒక కుమార్తె వాసంతీబెన్ హస్ముఖ్‌లాల్ మోదీ ఉన్నారు. హీరాబెన్ మోదీ గాంధీనగర్ సమీపంలోని రైసన్ గ్రామంలో ప్రధాని తమ్ముడు పంకజ్ మోదీతో కలిసి నివసించేవారు.


ప్రధాని తన పర్యటనలతో ఎంత బిజీగా ఉన్నా.. వీలు చిక్కినప్పుడల్లా గుజరాత్ వెళ్లి తల్లిని కలుసుకునేవారు. గతంలో గుజరాత్ ఎన్నికలకు ఓటు వేసే ముందు తన తల్లిని కలిసేందుకు ప్రధాని గుజరాత్ వెళ్లారు. జూన్‌లో కూడా తల్లి పుట్టినరోజు సందర్భంగా.. ప్రధాని మోదీ ఆమెను కలవడానికి వచ్చారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఒకరోజు ముందు ప్రధాని మోదీ తల్లి హీరాబెన్‌ను కలిశారు. ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ తన తల్లితో దాదాపు 45 నిమిషాలు గడిపారు.


వృద్ధాప్యంతో పాటు పలు అనారోగ్య సమస్యలతో బాధపుడుతున్నారు హీరాబెన్. రెండు రోజుల క్రితం శ్వాసకోస సబంధిత సమస్యతో యూఎన్ ఆసుపత్రిలో చేర్పించారు. తల్లి ఆసుపత్రిలో చేరిన విషయం తెలుసుకున్న మోదీ.. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు వచ్చారు. ఆసుపత్రి వైద్యులను ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగారు. ఆమెకు ప్రత్యేక వైద్యుల బృందం చికిత్స అందిస్తుండగానే తుది శ్వాస విడిచారు.


Also Read: Pele Death: లెజెండరీ ఫుట్‌బాల్ ప్లేయర్ పీలే ఇకలేరు.. శోకసంద్రంలో క్రీడా ప్రపంచం


Also Read: Dok-1 Max Cough Syrup: భారత దగ్గు మందుతో ఉజ్బెకిస్తాన్‌లో 18 మంది పిల్లలు మృతి.. విచారణ ప్రారంభించిన డబ్ల్యూహెచ్ఓ!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి