Corona Third Wave: కరోనా మహమ్మారి మరో దశను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా మౌళిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించింది. కరోనా థర్డ్‌వేవ్  సంసిద్ధతపై ప్రధాని మోదీ సమీక్షించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా థర్డ్‌వేవ్ భయం వెంటాడుతోంది. ఇప్పటికే చాలా దేశాల్లో ల్యాంబ్డా వేరియంట్(Lambda Variant)పేరుతో కరోనా కొత్త వేరియంట్ ప్రభావం చూపిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. ఈ నేపధ్యంలో ప్రధాని నేరంద్ర మోదీ కరోనా థర్డ్‌వేవ్ (Corona Third Wave)సంసిద్ధతపై సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఏర్పాటవుతున్న 15 వందలకు పైగా పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు త్వరగా పనిచేసేలా చూడాలని ప్రధాని మోదీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలని కోరారు. పీఎం కేర్స్ ఫండ్, మంత్రిత్వశాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల సహకారంతో ఈ ప్లాంట్లు నిర్మితమవుతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో పీఎం కేర్స్ ఫండ్ సహకారంతో ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులో వస్తున్నాయని..అన్నీ పనిచేస్తే 4 లక్షలకు పైగా ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో వస్తాయని అధికారులు ప్రధాని మోదీకు వివరించారు.


ప్రతి జిల్లాలోనూ శిక్షణ పొందిన అందుబాటులో ఉండేలా చూడాలని మోదీ (Pm Modi) సూచించారు. నిపుణులు సూచించిన శిక్షణా మాడ్యూల్ అమల్లో ఉందని దేశంలో 8 వేలమందికి శిక్షణ ఇవ్వాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్టు మోదీకు అధికారులు తెలిపారు. స్థానిక, జాతీయ స్థాయిలో ఆక్సిజన్ ప్లాంట్ల (Oxygen plants) నిర్వహణ, పనితీరు తెలుసుకునేందుకు ఐఓటి వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో తీసుకురావాలని ప్రధాని మోదీ అధికారులకు సూచించారు. 


Also read: Uttar pradesh Elections Survey: మళ్లీ యోగీకే పట్టం, యూపీలో నిర్వహించిన సర్వే వెల్లడి



Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి