Uttar pradesh Elections Survey: ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై అప్పుడే సందడి నెలకొంది. రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మరోసారి పీఠమెక్కేందుకు యోగీ ప్రభుత్వం యోచిస్తున్న తరుణంలో నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2022లో(Uttar pradesh Elections 2022) జరగనున్నాయి. దేశమంతా ప్రతిష్టాత్మకంగా భావించే యూపీ ఎన్నికల్లో అప్పుడే ఎన్నికల వాతావరణం నెలకొంది. వివిధ పార్టీలు పొత్తులు, సమీకరణాలపై దృష్టి పెట్టాయి. యూపీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే ఎన్డీయే ప్రభుత్వం ఇటీవల మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. ఈ నేపధ్యంలో యూపీలో నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
యూపీలో జరిగిన ఐఏఎన్ఎస్-సి ఓటరు సర్వేలో మరోసారి ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్(Yogi Adityanath) పీఠం అధిరోహిస్తారని వెల్లడైంది. రాష్ట్రంలో మొత్తం 12 వందలమంది ఇంటర్వ్యూలు తీసుకుున్నారు. 52 శాతం మంది ముఖ్యమంత్రి యోగీదే అధికారమని అభిప్రాయపడితే..37 శాతం మంది ఆయనకు వ్యతిరేకంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో విఫలమయ్యారని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక పంచాయితీ ఎన్నికల నిర్వహణ, కుంభమేళా, గంగానదిలో శవాలు కొట్టుకుని రావడం వంటి ఘటనలు యోగీపై తీవ్రతను మరింతగా పెంచాయి. ఇన్ని ప్రతికూలతలు ఉన్నా..52 శాతం మంది యోగీ వైపే మొగ్గు చూఫారని ఐఏఎన్ఎస్-సి ఓటరు సర్వే(IANS-C Voter Survey) తెలిపింది. ఇక కేంద్ర కొత్త కేబినెట్‌తో (Union Cabinet Extension) దేశంలోని పరిస్థితులు మెరుగుపడతాయని సర్వేలో 46 శాతమంది అభిప్రాయపడగా..41 శాతం మంది ఏ విధమైన ప్రయోజనం ఉండదని చెప్పారు.
Also read: Kappa variant cases: ఉత్తర్ ప్రదేశ్‌లో కప్ప వేరియంట్ కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook