లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై అభినందనలు తెలుపుతూ ప్రధాని మోదీ తమ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. కాంగ్రెస్ పార్టీ గానీ, మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూగానీ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించలేదని అన్నారు. నాడు నెహ్రూ బదులు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధాని అయి ఉంటే ఈ రోజు ఈ సమస్యలేవీ ఉండేవి కాదన్నారు. ప్రధానిగా పటేల్ ఉండి ఉంటే పీవోకే పాకిస్తాన్ కంట్రోల్‌లో ఉండేది కాదన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాలు:


* అద్భుతమైన విమానయానం తెచ్చింది మేమే. చిన్న పట్టణాలకు విమానాశ్రయాలు తెచ్చాం. దేశానికి రెక్కలు తొడిగాం.


* పార్టీ (కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ) నుంచి వారసులు వచ్చారు. పార్టీ కాదు.. దేశం శాశ్వతం అని గుర్తుంచుకోవాలి.


* బీజీపీ హయాంలో రోజుకు 22 కిలోమీటర్లు వేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రోజుకు 11 కిలోమీటర్లు వేశారు.


* రైతులకు మద్దతుధర పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పశువుల ఆరోగ్యంపైనా దృష్టి సారించాము.


* 2020 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యం.


* దేశంలో ఇంకా 20 శాతం మందికి కరెంట్ సౌకర్యం లేదు. అందుకే  విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి పెట్టాము.


*దేశం బహుముఖ నైపుణ్యాల కలబోత. ఒక్క ఏడాదిలోనే 70 లక్షల భవిష్యనిధి ఖాతాలను ప్రారంభించాము. సమతుల అభివృద్ధిని సాధించాము.