PM Narendra Modi: కొత్తగా ఎన్నికైన 18వ లోక్ సభకు సంబంధించిన పార్లమెంట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. లోక్ సభ సమావేశాల కంటే ముందు ప్రోటెం స్పీకర్ గా లోక్ సభలో వరుసగా 7 సార్లు ఎన్నికైన సీనియర్ సభ్యుడైన భర్తృహరి మహతాబ్ తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత ప్రోటెం స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన భర్తృహరి మహతాబ్ .. లోక్ సభ ముందుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ప్రమాణ స్వీకారం చేయించారు. లోక్ సభలో వరుసగా ప్రధాని హోదాలో మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన నేతగా నరేంద్ర మోడీ రికార్డు క్రియేట్ చేసారు. ఆయన ప్రమాణ స్వీకారం సందర్బంగా సభ మొత్తం మోడీ మోడీ నినాదాలతో దద్దరిల్లి పోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రధాన మంత్రి తర్వాత వరుసగా కేంద్ర మంత్రులైన రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, కుమారస్వామి, పియూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, జితిన్ రామ్ మాంఝీ, రాజీవ్ రంజన్ సింగ్, సర్భానందా సోనోవాల్, వీరేంద్ర కుమార్, కింజారపు రామ్మోహన్ నాయుడు, ప్రహ్లాద్ జోషి, జువల్ ఓరమ్, గిరిరాజ్ సింగ్, జ్యోతిరాదిత్య సింథియా, భూపేంద్ర యాదవ్, గజేంద్ర సింగ్ షెకావత్, అన్నపూర్ణ దేవి, కిరణ్ రిజిజు, మన్సుఖ్ మాండవీయ, కిషన్ రెడ్డి, చిరాగ్ పాశ్వాన్, సీఆర్ పాటిల్ ఎంపీలుగా లోక్ సభ సభ్యులుగా వరుసగా ప్రమాణ స్వీకారం చేసారు.


ఆ తర్వాత స్వతంత్ర హోదా మంత్రులతో పాటు కేంద్ర సహాయ మంత్రులు వరుసగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  ముందుగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేత ప్రమాణ స్వీకారం తర్వాత ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఎంపీలుగా గెలిచిన 22 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత వరుస క్రమంలో ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ రోజు మహారాష్ట్రలోని ఎంపీలతో ప్రమాణ స్వీకారం తర్వాత సభ రేపటికి వాయిదా పడనుంది. ఆ తర్వాత మిగిలిన సభ్యులు ఎంపీలుగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్లుండి 26వ తేదిన లోక్ సభ తదుపరి స్వీకర్ ను ఎన్నుకునే అవకాశం ఉంది.


Also read: IRCTC Alert: ఫ్రెండ్స్ కోసం రైల్వే టికెట్ బుక్ చేస్తున్నారా, మూడేళ్లు జైలు శిక్ష తప్పదు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook