PM Narendra Modi: నేడు డెహ్రాడూన్‌కు ప్రధాని మోదీ- రూ.18 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన!
PM Narendra Modi: డెహ్రాడూన్‌లో నేడు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇప్పటికే నెలకొల్పిన పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు కూడా.
PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ నేడు (డిసెంబర్ 4 శనివారం) ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌కు వెళ్లనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం, కొత్త వాటికి శంకుస్థాపన చేయడం (PM Modi Dehradun visit) వంటివి చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల విలువ దాదాపు రూ.18,000 కోట్లుగా అంచనా.
ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ శాన్య రాష్ట్రాల్లో టూరిజం అభివృద్ధి పనులను, రోడ్డు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వంటివి ప్రధాని డెహ్రాడూన్ పర్యటనలో కీలకమైన అంశాలుగా తెలిసింది.
ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకానమిక్ కారిడార్‌కు శంకుస్థాపన..
ప్రధాని మోదీ డెహ్రాడూన్ పర్యటనలో నేడు మొత్తం 11 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకానమిక్ కారిడార్ (ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే జంక్షన్ నుంచి డెహ్రాడూన్ వరకు) కీలకమైనది. ఈ ప్రాజెక్ట్ (Delhi-Dehradun Economic Corridor) అంచనా విలువ రూ.8,300 కోట్లు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే.. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు ప్రస్తుతం ఉన్న ఆరు గంటల ప్రయాణ సమయం దాదాపు 2.5 గంటలకు తగ్గిపోనుంది.
ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో ఏడు ముఖ్యమైన ఇంటర్‌ఛేంజ్‌లు ఉండనున్నాయి. వీటి ద్వారా.. హరిద్వార్, ముజాఫర్‌నగర్, షామ్లీ, యమునా నగర్, భాగ్‌పట్, మీరట్, బరౌత్ వంటి పట్టణాలకు అనుసంధానం అయ్యే అవకాశముంది.
ఈ ఎక్స్‌ప్రెస్ వేలో 12 కిలో మీటర్ల మేర ఆసియాలోనే అతిపెద్ద వన్యప్రాణుల ఎలివేటెడ్ కారిడార్ (Asia’s largest wildlife elevated corridor)ఉండనుంది.
దీనితో పాటు.. డెహ్రాడూన్‌లో నీటి సరఫర, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేసే పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.700 కోట్లు.
కీలక ప్రాజెక్ట్ ఆవిష్కరణ..
డెహ్రాడూన్‌లో ఏర్పాటైన స్టేట్ ఆఫ్ ఆర్టటట్ పెర్ఫ్యూమరీ అండ్ అరోమా లాబోరేటరి (సెంటర్ ఫర్ అరోమాటిక్ ప్లాంట్స్)ను ప్రధాని మోదీ నేడు ఆవిష్కరించనున్నారు. ఇందులో జరిగే పరిశోధనలు.. పెర్ఫ్యూమ్లు, సబ్బులు, శానిటైజర్లు, ఎయిర్ ఫ్రెషర్లు, అగరబత్తుల వంటి వాటిని ఉత్పత్తి చేసేందుకు ఉపయోగపడనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ కేంద్రం వల్ల.. సమీప ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల్లో కొత్త పరిశ్రమలు ఏర్పాటు అయ్యేందుకు అవకాశముందని వివరించింది.
Also read: Kangana Ranaut News: పంజాబ్ లోని రైతులు నా కారుపై దాడి చేశారు: కంగనా రనౌత్
Also read: Man Slaps UP Police: ఎస్సై చెంప చెళ్లుమనిపించిన యువకుడు..వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook