PM Narendra Modi urges people to take part in e-auction of gifts received by him: తనకు వచ్చిన కానుకలు, మెమెంటోలను ఈ–వేలం వేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi). ఆసక్తి ఉన్నవారు ఈ‌‌-వేలంలో (e-auction)పాల్గొని వాటిని కొనుగోలు మోదీ కోరారు. వాటిని అమ్మడంతో వచ్చిన డబ్బులన్నింటినీ గంగానదిని ప్రక్షాళనకు ఉద్దేశించిన నమామి గంగే ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తామని ప్రధాని తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత కొద్ది ఏళ్లుగా తనకు ఎందరో ఎన్నో కానుకలు ఇచ్చారన్నారు మోదీ. మన ఒలింపిక్‌ హీరోలు ఇచ్చిన ప్రత్యేక మెమొంటోలు, వారు ఉపయోగించిన వస్తువులు కూడా తన వద్ద ఉన్నాయన్నారు. ఇలా తన దగ్గరున్న అన్నింటినీ ఆన్‌లైన్‌ ద్వారా వేలం వేస్తున్నామని తెలిపారు. ఈ–వేలంలో అందరూ పాల్గొనవచ్చన్నారు. ఆసక్తి ఉన్నవారు వాటిని కొనుగోలు చేయవచ్చన్నారు.


Also Read : Covaxin: కోవాగ్జిన్ భవితవ్యం తేలేది అక్టోబర్ 6న, ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక భేటీ


గంగానది శుద్ధి చేయడానికే


ఈ–వేలంలో వచ్చిన డబ్బునంతా గంగానది (ganga river) శుద్ధి చేయడానికే వినియోగిస్తామని ప్రధాని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారంతా వ్యక్తులు, సంస్థలు ఎవరైనా సరే http://pmmementos.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఈ-వేలంలో పాల్గొనవచ్చు. 


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) జన్మదిన్నాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్‌ 17న కేంద్ర సాంస్కృతిక శాఖ .. మోదీ కానుకలను వేలం వెయ్యడం మొదలు పెట్టింది. అక్టోబర్‌ 7 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.


Also Read : CSK vs MI match Highlights: అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. ముంబైపై చెన్నై ఘన విజయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook