74th Independence Day: ప్రధాని మోదీ జాతీయ జెండా ఆవిష్కరణ పూర్తి షెడ్యూల్
నేడు 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ( 74th Independence Day celebrations ) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట జాతీయ జండా ఎగురవేసి వేడుకలను ప్రారంభిస్తారు.
న్యూ ఢిల్లీ: నేడు 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ( 74th Independence Day celebrations ) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట జాతీయ జండా ఎగురవేసి వేడుకలను ప్రారంభిస్తారు. అంతకంటే ముందుగా ఉదయం 7 గంటలకు రాజ్‌ఘాట్ ( Raj Ghat ) చేరుకోనున్న ప్రధాని మోదీ.. మన దేశానికి స్వాతంత్య్రం సాధించిన జాతిపిత మహాత్మ గాంధీకి ( Mahatma Gandhi ) అక్కడ నివాళి అర్పించనున్నారు. అనంతరం 7.14 కి అక్కడి నుండి బయల్దేరి 7.18కి ఎర్రకోట ( Red fort ) చేరుకోనున్నారు. 7.25కి ఎర్రకోట ముందున్న లాహోర్ గేట్ వద్ద సంప్రదాయం ప్రకారమే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ( Defence minister Rajnath Singh ), రక్షణ శాఖ కార్యదర్శి డా అజయ్ కుమార్ ప్రధాని మోదీకి ఎదురెళ్లి స్వాగతం పలకనున్నారు. Also read : Independence Day: పోలీస్ మెడల్స్‌ను ప్రకటించిన హోంశాఖ
ప్రధాని మోదీ సెల్యూటింగ్ బేస్ వద్దకు చేరుకోగానే.. అక్కడున్న ఆర్మీ బలగాలు, పోలీసు దళాల నుండి సైనిక వందనం అందుకుంటారు. అనంతరం ప్రధాని మోదీ అక్కడి నుంచి ఎర్రకోటపై భాగం వైపు పయణం అవుతారు. ఢిల్లీ ఏరియాకు చెందిన జనరల్ ఆఫీసర్ కమాండిగ్ ప్రధాని మోదీని ఎర్రకోటపై భాగానికి ఎస్కార్ట్ చేస్తారు. Also read : Narendra Modi: కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ రికార్డు
ఎర్రకోటపైకి చేరుకున్న అనంతరం ప్రధాని మోదీ జాతీయ జెండాను ( Unfurling national flag ) ఎగురవేస్తారు. అదే సమయంలో అక్కడి భద్రతా బలగాలతో కలిసి ప్రధాని మోదీ జాతీయ జెండాకు గౌరవ వందనం అర్పిస్తారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం ప్రదాని మోదీ ఎర్రకోటపై నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఎర్రకోట వద్ద జాతీయ జెండాకు గౌరవ వందనం అర్పించే భద్రతా బలగాలలో త్రివిధ దళాలతో పాటు ఢిల్లీ పోలీసులు పాల్గొంటారని రక్షణ శాఖ వెల్లడించింది. Also read : Independence day: పంద్రాగస్టు..కరోనా వైరస్...కట్టుదిట్టమైన ఏర్పాట్లివే
రక్షణ శాఖ విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం జాతీయ జెండాను ఎగురవేయడంలో మేజర్ శ్వేతా పాండే ప్రధాని మోదీకి సహకరించనుండగా... సుబేదార్ మేజర్ అబ్ధుల్ ఘని నేతృత్వంలోని ఆర్మీ గ్రెనేడియర్స్ రెజిమెంటల్ సెంటర్ మిలిటరీ బ్యాండ్ బృందం జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. Also read : COVID-19 vaccine: భారత్ చేస్తోన్న కొవిడ్-19 వ్యాక్సిన్ ప్రయోగాలపై భూటాన్ ఆసక్తి
ఆర్మీ, నేవి, ఎయిర్ ఫోర్స్‌కి చెందిన 500 మంది ఎన్సీసీ క్యాడెట్స్ ఈ వేడుకల్లో పాల్గొంటారని రక్షణ శాఖ తెలిపింది. డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ( General Bipin Rawat ), ఆర్మీ చీఫ్ ఎంఎం నరవనె ( General MM Narawane ), నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ ( Admiral Karambir Singh), ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఆర్కెఎస్ భదౌరియా ( Chief Marshal R K S Bhadauria ) ఎర్రకోట వద్ద జరగనున్న 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. ప్రధాని మోదీకి ఎర్రకోటపై నుండి జాతీయ జెండాను ఎగురవేసే అవకాశం రావడం ఇది ఏడోసారి కావడం విశేషం. Also read : Pakistan vs Saudi Arabia: పాకిస్థాన్‌కి సౌది అరేబియా భారీ షాక్