Independence Day: పంద్రాగస్టు నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల ఆలోచనల్ని ఆయన నోట పలకాలనేది ప్రధాని ఆలోచనగా ఉంది. అందుకు ఓ వేదిక సిద్ధం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం(Independence Day)సమీపిస్తోంది. పంద్రాగస్టు రోజున ప్రజల ఆలోచనల్ని తన నోట పలకాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనగా ఉంది. అందుకే ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. పంద్రాగస్టునాడు ఎర్రకోట సాక్షిగా జరిగే ప్రసంగంలో ఏం మాట్లాడాలనేది ప్రజలే చెప్పాలంటున్నారు. ప్రజల ఆలోచనలు, ఆశయాల్ని దేశ ప్రజలకు వివరిస్తానన్నారు. దీనికోసం ఓ వేదిక సిద్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్ సిటిజన్ ఎంగేజ్‌మెంట్ ప్లాట్‌ఫారమ్ Mygovindiaలో తమ ఆలోచనల్ని పంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra modi) పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవాన ఇండియాను ముందుకు నడిపించేందుకు దేశ పౌరుల నుంచి ఆలోచనలు స్వీకరిస్తున్నారు.ఎర్రకోట నుంచి ప్రసంగించేది తానే అయినా...అవి దేశ ప్రజల మనసులో మాటలుగా ఉండాలని మోదీ కోరుకుంటున్నారు. ప్రతియేటా జరిగినట్టే జాతినుద్దేశించి ప్రదాని మోదీ ప్రసంగం ఉంటుంది. సాధారణంగా ఈ ప్రసంగంలో ప్రభుత్వ కార్యక్రమాలు, విధి విధానాలు, దేశాన్ని అభివృద్ధి బాటలో నడపడం గురించి ఉంటుంది. ఈసారి కాస్త భిన్నంగా ప్రజల ఆలోచనలు మోదీ ప్రసంగంలా సాగుతాయి.


Also read: ఆవిరైన ఇండియా స్వర్ణం ఆశలు, టోక్యో ఒలింపిక్స్ సెమీస్‌లో పీవీ సింధూ ఓటమి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook