ఆవిరైన ఇండియా స్వర్ణం ఆశలు, టోక్యో ఒలింపిక్స్ సెమీస్‌లో పీవీ సింధూ ఓటమి

Tokyo Olympics: భారత షట్లర్ పీవీ సింధూ స్వర్ణం ఆశలు ఆవిరయ్యాయి. టోక్యో ఒలింపిక్స్‌లో సింధూ..తైజుయింగ్ చేతిలో పరాజయం పాలైంది. కాంస్యం ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 31, 2021, 07:25 PM IST
ఆవిరైన ఇండియా స్వర్ణం ఆశలు, టోక్యో ఒలింపిక్స్ సెమీస్‌లో పీవీ సింధూ ఓటమి

Tokyo Olympics: భారత షట్లర్ పీవీ సింధూ స్వర్ణం ఆశలు ఆవిరయ్యాయి. టోక్యో ఒలింపిక్స్‌లో సింధూ..తైజుయింగ్ చేతిలో పరాజయం పాలైంది. కాంస్యం ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయి.

చైనీస్ తైజూయింగ్ ప్రతికారం తీర్చుకుంది. రియో ఒలింపిక్స్‌లో(Rio olympics) సింధూ చేతిలో ఓటమి పాలైన తైజుయింగ్ ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్(Tokyo olympics)సెమీస్‌లో సింధూపై ఘన విజయం సాధించింది. గత రెండు ఒలింపిక్స్‌లోనూ క్వార్టర్స్‌కు కూడా చేరని తైజుయింగ్ ఈసారి ఏకంగా ఫైనల్‌లో దూసుకెళ్లింది. ఒలింపిక్స్‌లో తొలి పతకాన్ని సాధించబోతోంది. ఇక స్వర్ణం కోసం సింధూపై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. 2-0 తేడాతో తైజూయింగ్..సింధూ(PV Sindhu)పై పూర్తి ఆధిక్యత కనబర్చింది. తైజూయింగ్ వరుస గేమ్‌లలో 21-18, 21-12 తేడాతో ఓడించి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

తైజూయింగ్(TaiZuying)చేతిలో సింధూకు ఇది ఏకంగా 14వ ఓటమి. ఇప్పటివరకూ ఈ ఇద్దరూ 19 సార్లు తలపడగా..కేవలం 5 సార్లు మాత్రమే సింధూ విజయం సాధించింది. కెరీర్‌లో మొత్తం 559 మ్యాచ్‌లలో 407 మ్యాచ్ విజయాలతో ప్రపంచ నెంబర్ వన్‌గా తైజూయింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం సింధూకు కాంస్యం ఆశలు బతికున్నాయి. 

Also read: Tokyo Olympics: ఒలింపిక్స్‌లో ప్రకటనలకు దూరంగా టొయోటా కంపెనీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News