కోటి 70 లక్షల విలువైన పాము విషం స్మగ్లింగ్ !
కోటి 70 లక్షల విలువైన పాము విషం స్మగ్లింగ్
కాదేదీ కవితకు అనర్హం అన్నచందంగా కాదేదీ స్మగ్లింగ్‌కి అనర్హం అంటున్నారు అడ్డదారిలో డబ్బు సంపాదనకు అలవాటు పడిన ఘనులు. అదేవిధంగా అత్యంత పవర్‌ఫుల్ అయిన విష సర్పాల విషాన్ని సేకరించి స్మగ్లింగ్‌కి పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను తాజాగా మహారాష్ట్ర పోలీసులు పట్టుకున్నారు. అలీబాగ్‌కి సమీపంలోని మంద్వా జెట్టీ ప్రాంతంలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పాము విషం రూ. కోటి డెబ్బై లక్షల విలువ చేస్తుందని పోలీసులు తెలిపారు.