జైషే ఉగ్రవాదుల కుట్ర భగ్నం, ఐదుగురి అరెస్ట్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారీ కుట్రకు ప్రణాళిక చేసిన పాకిస్థాన్ ప్రేరేపిత జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఐదుగురిని శ్రీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సెంట్రల్ కశ్మీర్ రేంజ్ డీఐజీ వెల్లడించారు. పుల్వామా సహా భారత్‌లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో జేషే పాత్ర ఉందని అన్నారు.
శ్రీనగర్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారీ కుట్రకు ప్రణాళిక చేసిన పాకిస్థాన్ ప్రేరేపిత జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఐదుగురిని శ్రీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సెంట్రల్ కశ్మీర్ రేంజ్ డీఐజీ వెల్లడించారు. పుల్వామా సహా భారత్‌లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో జేషే పాత్ర ఉందని అన్నారు.
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో గత ఏడాది ఫిబ్రవరిలో జేషే మహ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. తాజాగా అరెస్ట్ అయిన ఉగ్రవాదుల నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అరెస్టు చేసిన ఐదుగురిని ఐజాజ్ అహ్మద్ షేక్, ఉమర్ హమీద్ షేక్, ఇంతియాజ్ అహ్మద్ చిక్లా, షఫీల్ ఫరూక్ గోజ్రీ, నసీర్ అహ్మద్ మిర్‌లుగా పోలీసులు గుర్తించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..