Covid19 Virus: ఇండియాలో పెరుగుతున్న రికవరీ రేటు
దేశంలో కరోనా కేసులు ఓ వైపు భారీగా పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతున్నాయనే ఆందోళన నేపధ్యంలోనే ఊరట కల్గించే అంశం కూడా వెలుగుచూస్తోంది. దేశంలో రికవరీ రేటు ఇప్పుడు భారీగా పెరుగుతోంది.
దేశంలో కరోనా కేసులు ( Corona cases ) ఓ వైపు భారీగా పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతున్నాయనే ఆందోళన నేపధ్యంలోనే ఊరట కల్గించే అంశం కూడా వెలుగుచూస్తోంది. దేశంలో రికవరీ రేటు ఇప్పుడు భారీగా పెరుగుతోంది.
ఇండియాలో కరోనా సంక్రమణ ( Corona spread in india ) వేగంగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. దేశంలో ఇప్పటివరకూ దాదాపు 15 లక్షల కేసులు నమోదయ్యాయి. ఇందులో సగానికి పైగా అంటే 9 లక్షల 52 వేల 743 మంది పూర్తిగా కోలుకున్నారు. అంటే ఏకంగా 64.24 శాతం కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గతంలో అంటే 40 రోజుల క్రితం ఇది 53 శాతంగా ఉండేది. 40 రోజుల వ్యవధిలో రికవరీ రేటు ( Recovery rate ) పది శాతం వరకూ పెరగడం నిజంగానే ఆనందించే విషయం. అటు మరణాల రేటు కూడా రోజురోజుకూ తగ్గిపోతోంది. జూన్ 18 న మరణాల రేటు 3.33 శాతముంటే..ఇప్పుడది 2.25 శాతంగా ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల్లో దేశం మూడోస్థానంలో ఉన్నాసరే...మిగిలిన దేశాలతో పోలిస్తే రికవరీ, మరణాల రేటులో పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 49 వేల కొత్త కేసులు వెలుగుచూశాయి. ఇతర దేశాల్లో మరణాల రేటు ( Death Rate ) భారత్ తో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. Also read: India: 15 లక్షలు దాటిన కరోనా కేసులు