Post office Monthly Scheme: పోస్టాఫీసులో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఖాతా తెరవాలనుకుంటున్నారా..ఈ ఖాతా వల్ల ప్రయోజనాలేంటి..మైనర్ల పేరిట ఎక్కౌంట్ ఓపెన్ చేయవచ్చా లేదా. చాలా ప్రశ్నలకు సమాధానమిదే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ప్రభుత్వం (Central government)ఇటీవలే చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు యధాతధంగా ఉంచింది. ఫలితంగా పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకంలో పెట్టుబడులు పెట్టినవారు ఏడాదికి 6.6 శాతం వడ్డీ పొందుతున్నారు. ఇందులో మీరు పెట్టిన నిర్దిష్టమైన పెట్టుబడిపై ప్రతినెలా స్థిరమైన వడ్డీని పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి ఎక్కౌంట్ ఓపెన్ చేయండి.


ఇండియన్ సిటిజన్ అయితే చాలు పీఎంఐఎస్ ఎక్కౌంట్(POMIS Account)ఓపెన్ చేసుకోవచ్చు. ముగ్గురితో జాయింట్ ఎక్కౌంట్ కూడా చేయవచ్చు. చిన్నారుల పేరిట పొదుపు చేయాలనుకునేవారికి ఇదే మంచి అవకాశం. పదేళ్ల కంటే ఎక్కువ వయస్సున్న మీ మైనర్ చిన్నారుల పేరిట కూడా ఎక్కౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఖాతా తెరిచేందుకు కనీసం వేయి రూపాయలు, గరిష్టంగా 4.5 లక్షల వరకూ సింగిల్ హోల్డర్ ఖాతాలో వేయవచ్చు. జాయింట్ ఎక్కౌంట్ అయితే 9 లక్షల వరకూ అవకాశముంటుంది. జాయింట్ హోల్డర్లు సమాన వాటాను ప్రతి నెలా పొందుతారు. ఖాతా తెరిచిన ఓ నెల తరువాత నుంచి వడ్డీ చెల్లింపు ప్రారంభమవుతుంది. ప్రతి నెలా చెల్లించే వడ్డీని తీసుకోకపోతే..ఆ వడ్డీపై అదనపు వడ్డీ ఉండదు. ఫిక్స్‌డ్ లిమిట్ కంటే ఎక్కువ డిపాజిట్ చేసినా రిఫండ్ చేసేస్తారు. డిపాజిట్ చేసిన అదనపు మొత్తంపై పోస్టాఫీసు సేవింగ్స్ ఎక్కౌంట్ వడ్డీ వర్తిస్తుంది. ఆటో క్రెడిట్ ఆప్షన్ తీసుకుంటే..ప్రతి నెలా వడ్డీని సేవింగ్స్ ఖాతాకు మళ్లించవచ్చు. ఈ వడ్డీ ఆదాయం పన్ను(Income Tax)పరిధిలో వస్తుంది. అంటే మినహాయింపు వర్తించదు.


ఎక్కౌంట్ తెరిచిన ఐదేళ్ల తరువాత ఎక్కౌంట్ క్లోజ్ చేయవచ్చు. ఒకవేళ ఖాతాదారుడు పీఓఎమ్ఐఎస్ ఎక్కౌంట్ మెచ్యూరిటీకు ముందే మరణిస్తే..క్లోజ్ చేసుకోవచ్చు. డిపాజిట్ చేసిన డబ్బులు నామినీ లేదా లీగల్ వారసులకు రిఫండ్ చేస్తారు. డిపాజిట్ చేసిన తేదీ నుంచి గడువు ముగియడానికి ఏడాది ముందు వరకూ ఎలాండి డిపాజిట్ డబ్బు విత్‌డ్రా చేయకూడదు.


Also read: Asaduddin Owaisi: మోహన్ భగవత్ వ్యాఖ్యలపై మండిపడిన అసదుద్దీన్ ఒవైసీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook