జాతీయ స్థాయిలో సత్తా చాటి ప్రధాని కావాలనే అఖిలేష్ కోరిక మరోసారి బయటపడింది. యూపీలోని పలుచోట్ల " కాబోయే ప్రధాని " అఖిలేష్ అంటూ పోస్టర్లు వెలిశాయి. కాంగ్రెస్ ను లెక్కచేయకుండా ఇప్పటికే  మాయవతి పార్టీతో అఖిలేష్ పొత్తు ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. ఫలితంగా యూపీలో ఎస్పీ - బీఎస్పీ పార్టీలు బీజేపీ వ్యతిరేక కూటమిగా ఏర్పడ్డాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమను లెక్కచేయకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమిని వ్యతిరేకించలేదు..పైగా బీజేపీ వ్యతిరేక శక్తులుగా ఏర్పడాన్ని ఆహ్వానించింది. ఎన్నికల తర్వాత ఎలాగైనా తమకు మద్దతు ఇస్తాయనే ఆశతోనే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వైఖరి ప్రదర్శించిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే అఖిలేష్ తాను ప్రధాని కావాలనే కోరికను ఇలా బయటపెట్టడం.. కాంగ్రెస్ కు మింగపడటం లేదు. 


వాస్తవానికి యూపీలో మొత్తం 80 సీట్లు ఉన్నాయి. కేంద్రంలో అధికారం చేపట్టాలంటే యూపీ కీలక ప్రాత్ర పోషిస్తుంది. గత ఎన్నికల్లో కూడ ఇదే రుజువైంది.  ఈ నేపథ్యంలో  యూపీలో  సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు సాధించి ప్రధాని రేసులో నిలబడాలని ఇటు అఖిలేష్ యాదవ్.. అటు మయావతి లు తమదైన శైలిలో ప్రయత్నాలు మొదలెట్టారు. ఈ నేపథ్యంలో కాబోయే పీఎం అఖిలేష్ అంటూ యూపీలో పలుచోట్ల పోస్టుర్లు కనిపించడం గమనార్హం