Pradhan Mantri Kisan Maandhan Yojana: ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పథకం.. చిన్న, సన్నకారు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్ పథకం ఇది. రెండు హెక్టార్లలోపు వ్యవసాయ భూమి కలిగి ఉండి 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సున్న రైతులు ఈ పెన్షన్ పథకానికి అర్హులు అవుతారు. రైతుల సంక్షేమం కోసం కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాల్లో ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పథకం కూడా ఒకటి. ఇదే కాకుండా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ సమృద్ధి కేంద్రాలు, కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం, ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన వంటి ఇతర పథకాలు కూడా రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు సంవత్సరంలో మూడు సమాన వాయిదాలలో రూ. 2000 చొప్పున మొత్తం రూ. 6000 లభిస్తున్నాయి. ఇది రైతులకు పెట్టుబడి కింద కేంద్రం అందిస్తున్న ఆర్థిక సహాయం. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పెట్టుబడి సాయం వర్తమానకాలంలో రైతులకు చేదోడువాదోడుగా ఉండే పథకం కాగా.. వారి వృధ్యాప్యంలో సామాజిక భద్రతను కల్పించే పెన్షన్ పథకమే ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పథకం. 


40 సంవత్సరాల వయస్సుకుపైబడి 2 హెక్టార్ల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు చిన్న, సన్నకారు రైతులు ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పథకానికి అర్హులు కారు. లబ్ధిదారుల పేరు మీద భూమి ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య రైతులు ఈ పథకంలో చేరితే.. 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు 3000 రూపాయల పెన్షన్ లభిస్తుంది. ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పథకం నిబంధనల ప్రకారం.. ఒకవేళ లబ్ధిదారులైన రైతు చనిపోతే, రైతు జీవిత భాగస్వామికి పెన్షన్‌లో 50% కుటుంబ పెన్షన్‌గా పొందేందుకు అర్హులు అవుతారు. అలా 50 శాతం అందించే కుటుంబ పెన్షన్ కేవలం జీవిత భాగస్వామికు మాత్రమే వర్తిస్తుంది. వారి సంతానానికి ఈ పథకం ఫలాలు వర్తించవు.


18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల దరఖాస్తుదారులు 60 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు నెలకు రూ. 55 నుండి రూ. 200 వరకు నెలవారీగా ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పథకం ఖాతాలో చెల్లించవలసి ఉంటుంది. దరఖాస్తుదారుడికి 60 ఏళ్లు వచ్చిన తర్వాత పెన్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. 


ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పథకం కింద రైతులు తమ ఖాతాలో ఎంతయితే జమ చేస్తారో.. అంతే మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుంది. ఉదాహరణకు ఒక రైతు నెలకు రూ.100 జమ చేస్తే, ప్రభుత్వం కూడా నెలకు రూ.100 పెన్షన్ ఫండ్‌లో జమ చేస్తుంది. ఇప్పటివరకు, 1,92,5,369 మంది రైతులు ప్రధాన మంత్రి కిసాన్ మంధన్ యోజనలో లబ్ధిదారులుగా చేరారు. 


అయితే, నేషనల్ పెన్షన్ స్కీమ్, ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ స్కీమ్, చట్టబద్ధమైన సామాజిక భద్రత పెన్షన్ పథకాల పరిధిలోకి రాని చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే ప్రధాన మంత్రి కిసాన్ మంధన్ యోజన పథకం వర్తిస్తుంది. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఏదైనా ఇతర పెన్షన్ స్కీమ్‌కి అర్హులైన వారికి ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పథకం వర్తించదన్నమాట.


Also Read : Note Printing Cost: కరెన్సీ నోట్ల ప్రింటింగ్‌కు ఎంత ఖర్చవుతుందో తెలుసా..!


Also Read : Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసికి ముస్లిం యువత చేతిలో గుజరాత్‌లో చేదు అనుభవం


Also Read : DA Hike For Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న జీతం.. లెక్కలు ఇలా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook