Asaduddin Owaisi: గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూరత్ తూర్పు నియోజకవర్గానికి వెళ్లిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసికి చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింల ఆధిక్యత ఉన్న ప్రాంతాల్లో ఎంఐఎం అభ్యర్థులను గెలిపించి ప్రధాని మోదీకి షాకివ్వాలని భావించిన అసదుద్దీన్ ఒవైసి ప్రస్తుతం తమ పార్టీ అభ్యర్థుల తరపున అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అందులో భాగంగానే సూరత్ తూర్పు నియోజకవర్గంలో ఆదివారం రాత్రి జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే, గుజరాత్‌లో ఎంఐఎం అభ్యర్థులను గెలిపించుకుని ప్రధాని మోదీకి షాక్ ఇవ్వాలనుకున్న అసదుద్దీన్ ఒవైసికి అక్కడి ముస్లిం యువత నుంచే షాక్ ఎదురైంది.
సూరత్ తూర్పు ఎంఐఎం ఎన్నికల ర్యాలీ సభలో సభా వేదికపై మాట్లాడేందుకని అసదుద్దీన్ ఒవైసి లేచినిలబడటంతోనే ఆయనకు వ్యతిరేకంగా మోదీ - మోదీ అంటూ నినాదాలు కొంతమంది ముస్లిం యువత బిగ్గరగా నినాదాలు చేయడం ప్రారంభించారు. అంతటితో ఊరుకోని ముస్లిం యువత.. ఆ తర్వాత ఒవైసి గో బ్యాక్ ఒవైసి గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడం ఆరంభించారు. అదే సమయంలో అసదుద్దీన్ ఒవైసి రాకను నిరసిస్తూ నల్ల జండాలు చూపించారు.
అసదుద్దీన్ ఒవైసి ఎక్కడికెళ్లినా అక్కడ ఎన్నికల ప్రచారంలో ఒవైసికి అనుకూల నినాదాలు చేసే అనుచరులు వారి వెంట ఉంటారనే టాక్ ఉంది. కానీ సూరత్ తూర్పు నియోజకవర్గంలో సీన్ రివర్స్ అయింది. స్థానిక ముస్లిం యువత అసదుద్దీన్ ఒవైసికి వ్యతిరేకంగా నిరసన గళమెత్తారు. దీంతో అన్ని ఎన్నికల సభలో ముస్లిం కార్డు ఉపయోగించి అధికారపక్షంపై విరుచుకుపడే అసదుద్దీన్ ఒవైసి.. ఈసారి దళిత కార్డుతో తన ప్రసంగాన్ని కొనసాగించారు.
#WATCH | Black flags shown and 'Modi, Modi' slogans raised by some youth at a public meeting addressed by AIMIM MP Asaduddin Owaisi in Gujarat's Surat yesterday pic.twitter.com/qXWzxvUc5V
— ANI (@ANI) November 14, 2022
దళితులకు, ఓబీసీలకు, గిరిజనులకు వ్యతిరేకంగా ప్రధాని మోదీ పాలన కొనసాగుతోందని బీజేపి పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు. దళిత సోదరులకు, ఓబీసీ సోదరులకు, గిరిజన సోదరులకు అన్యాయం జరిగే విధంగా ప్రధాని మోదీ చట్టాలు చేస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్ల విషయంలో ప్రధాని మోదీ నిర్ణయాలు బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడిచేవిగా ఉన్నాయని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారి పేరిట చేస్తున్న చట్టాలు వాస్తవానికి పేదల కోసం చేసినవి కాదని.. అగ్రవర్ణాలకు అనుకూలంగా చేస్తున్న చట్టాలే అని అసదుద్దీన్ ఒవైసి అభిప్రాయపడ్డారు.
Also Read : BJP Leader Blood Letter: ముఖ్యమంత్రికి రక్తంతో లేఖ రాసిన బీజేపీ నాయకుడు.. నెట్టింట వైరల్
Also Read : DA Hike For Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న జీతం.. లెక్కలు ఇలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook