రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఇస్తార్ విందు ఇవ్వనుంది. ఈ నెల 13న విందు ఏర్పాటు చేయాలని నిర్ణయింది. కాగా  కాంగ్రెస్ పార్టీ  విందులో ప్రముఖలను పిలవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సారి ఇస్తార్ విందులో కాంగ్రెస్ వాదీ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ను పక్కన పెట్టాలని భావిస్తోంది. అందుకే ఇప్పటి వరకు దాదాను ఆహ్వానించలేదట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమ మాటను కాదని పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకమైన ఆర్ఎస్‌ఎస్ కార్యక్రమానికి వెళ్లినందుకే కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఇఫ్తార్ విందుకు ఆయన్ను దూరం పెట్టారనే వాదన వినిపిస్తోంది.


ఢిల్లీ లోని తాజ్ ప్యాలెస్ లో ఇస్తున్న విందులో ప్రణబ్ తో పాటు అరవిత్ కేజ్రీవాల్, మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీలకు ఆహ్వానించలేదని తెలిసింది. కాగా కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల తర్వాత గ్యాప్ ఇచ్చి ఈ ఏడాది ఇఫ్తార్ విందు ఇవ్వడం విశేషం