జాతిపిత మహాత్మాగాంధీ 151వ జయంతి (Mahatma Gandhi Birth Anniversary) వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించిన మహాత్ముడి జయంతి (Mahatma Gandhi Jayanti) నేడే (అక్టోబర్ 2). ఆయన చూపిన శాంతి, అహింస దారులను మన మార్గంగా మలుచుకుని విజయాలు సాధించాలని యావత్ భారతావని భావిస్తోంది. మహాత్ముడి జయంతిని పురస్కరించుని ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi), తదితర నేతలు ఘనంగా నివాళి అర్పించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : Gold Price: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు


రాజ్‌ఘాట్ వద్ద పుప్ఫగుచ్చం ఉంచి బాపూజీకి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Ram Nath Kovind) నివాళి అర్పించారు. మహాత్ముడు చూపిన దారిలో నడవాలని రాష్ట్రపతి కోవింద్ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య పోరాటంలో మహాత్ముడి పాత్రను, సేవలను స్మరించుకున్నారు. 


Also Read :​ Rohit Sharma: విరాట్ కోహ్లీ, సురేష్ రైనా సరసన రోహిత్ శర్మ


 



యువత మహాత్ముడిని స్ఫూర్తిగా తీసుకొని బాపూజీ మార్గంలో ముందుకు నడవాలని ప్రధాని మోదీ  పిలుపునిచ్చారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం సాధించిన మహోన్నతమైన వ్యక్తి గాంధీ అని ఆయన త్యాగాల్ని, సేవల్ని గుర్తుచేసుకున్నారు. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe