Rohit Sharma IPL Runs: విరాట్ కోహ్లీ, సురేష్ రైనా సరసన రోహిత్ శర్మ

IPL 2020లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, సీఎస్కే ఆటగాడు సురేష్ రైనాల సరసన (Rohit Sharma completes 5000 IPL Runs) నిలిచాడు.

Last Updated : Oct 2, 2020, 08:23 AM IST
Rohit Sharma IPL Runs: విరాట్ కోహ్లీ, సురేష్ రైనా సరసన రోహిత్ శర్మ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌ రోహిత్ శర్మ (Rohit Sharma) అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 5000 పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాట్స్‌మెన్ (Rohit Sharma completes 5000 IPL Runs)‌గా రికార్డు నెలకొల్పాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, సీఎస్కే ఆటగాడు సురేష్ రైనాల సరసన నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో 5వేల మార్క్ చేరుకున్నది ముగ్గురు క్రికెటర్లు కాగా, ఆ ముగ్గురు భారత క్రికెటర్లే కావడం గమనార్హం.

 
అబుదాబి వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో గురువారం రాత్రి జరిన మ్యాచ్‌లో తాను ఆడిన తొలి బంతినే బౌండరీకి తరలించి 5000 పరుగుల మైలురాయిని ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కెప్టెన్ రోహిత్ శర్మ అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్‌లో అరుదైన క్రికెటర్ల జాబితాలో రోహిత్ చేరాడు. 180 మ్యాచ్‌లాడిన విరాట్ కోహ్లీ 131.13 స్ట్రైక్‌రేట్‌తో 5,430 పరుగులు చేశాడు. లీగ్‌లో అత్యధిక పరుగుల వీరులలో నెంబర్ వన్‌గా కొనసాగుతున్నాడు. 

 Also Read :  Rohit Sharma SIXES in IPL: సిక్సర్లలో రోహిత్ శర్మ అరుదైన ఘనత.. కోహ్లీ ఎక్కడ?

చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేష్ రైనా 193 మ్యాచ్‌లాడి.. 5,368 పరుగులు సాధించాడు. రైనా తర్వాత అత్యధిక పరుగుల వీరులలో రోహిత్ ఉన్నాడు. తన 191వ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఐపీఎల్‌లో 5 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. సురేష్ రైనా, రోహిత్ శర్మ ఐపీఎల్‌లో ఒక్క శతకం బాదగా.. కింగ్ విరాట్ కోహ్లీ ఏకంగా 5 ఐపీఎల్ శతకాలు బాదడం విశేషం. 

Also Read :  RCB vs MI Super Over: ఇషాన్ కిషన్‌ను అందుకే బ్యాటింగ్‌కు పంపలేదు: రోహిత్ శర్మ 

 

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ 129 మ్యాచ్‌లలో 4,793 పరుగులు సాధించి అత్యధిక పరుగుల బ్యాట్స్‌మెన్‌లలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదే సీజన్‌లో 5వేల మార్క్ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News