నిర్భయ దోషికి క్షమాభిక్ష తిరస్కరించిన రాష్ట్రపతి కోవింద్.. తర్వాత ఏంటి?
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో దోషి ముకేశ్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వద్ద తిరస్కరించారు. గురువారం (జనవరి 16) రాత్రి ముకేశ్ పిటిషన్‌ను రాష్ట్రపతి భవన్‌కు కేంద్ర హోం మంత్రిత్వశాఖ పంపించింది.
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో దోషి ముకేశ్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వద్ద తిరస్కరించారు. గురువారం (జనవరి 16) రాత్రి ముకేశ్ పిటిషన్‌ను రాష్ట్రపతి భవన్‌కు కేంద్ర హోం మంత్రిత్వశాఖ పంపించింది. క్షమాభిక్ష తిరస్కరించాలని సైతం రాష్ట్రపతికి హోంశాఖ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో నేడు (జనవరి 17న) క్షమాభిక్ష పిటిషన్‌ను కోవింద్ తిరస్కరించారు. ఈ విషయాన్ని హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. ఉరిశిక్ష అమలయ్యే తిహార్ జైలు అధికారులకు సైతం సమాచారాన్ని చేరవేశారు.
Also Read: ఈ 22న నిర్భయ దోషులకు ఉరి. ఎవరీ పవన్ జల్లాద్?
కాగా, జనవరి 22న ఉదయం 7 గంటలకు నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలంటూ కొన్ని రోజుల కిందట ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరు దోషులు క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేసుకోగా ఎన్వీ రమణ ధర్మాసనం వాటిని తిరస్కరించింది. అనంతరం దోషుల్లో ఒకడైన ముకేశ్ క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. తొలుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ఆపై కేంద్ర హోంశాఖ ముకేశ్ పిటిషన్‌ను తిరస్కరించగా.. తాజాగా రాష్ట్రపతి సైతం నిర్భయ నిందితుడికి క్షమాభిక్షను ప్రసాదించలేదు.
క్షమాభిక్షపై రాష్ట్రపతి నిర్ణయం తేలేవరకు నిర్భయ నిందితుల ఉరిశిక్ష అమలుపై ముందడుగు వేయలేదని ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు చెప్పింది. అయితే పాటియాలా హౌస్ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్‌లో ఏ తప్పిదం లేదని, ఉరిశిక్ష అమలుపై స్టే విధించలేమని హైకోర్టు స్పష్టం చేయడం తెలిసిందే. కాగా, రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించినా.. శిక్ష అమలు చేసేందుకు చట్టపరంగా 14 రోజుల గడువు ఉంటుందని జనవరి 22న నిర్భయ దోషులకు ఉరిశిక్ష వేయలేమని ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది. నిర్భయ దోషులకు అన్నిదారులు మూసుకుపోయిన నేపథ్యంలో ఉరిశిక్ష ఎప్పుడు అమలవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.