Price of domestic LPG cylinders hiked by Rs 15 and Petrol Diesel Prices Hiked For Second Straight Day: వంటింట్లో గ్యాస్‌ బండ రోజురోజుకు గుదిబండలా మారుతోంది. పెరుగుతోన్న గ్యాస్ ధరతో సామాన్యాలు ఇబ్బందులుపడాల్సి వస్తోంది. పెట్రోల్‌, నిత్యావసరాల ధరలు ఓవైపు మోత మోగిస్తున్నాయి. ఈ సమయంలో గ్యాస్‌ సిలిండర్‌ ధరను ( LPG cylinder) కూడా చమురు సంస్థలు పెంచేశాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో వంట గ్యాస్ ధ‌ర‌లు మళ్లీ పెరిగాయి. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో (international market) ముడి చమురు ధ‌ర‌లతో సిలిండ‌ర్ల ధ‌ర‌లు (cylinder rates) పెరిగాయి. దీంతో వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర బుధవారం 15 రూపాయలు పెరిగింది. ఢిల్లీలో నాన్‌ సబ్సిడీ సిలిండర్‌ ధర రూ.899.50చేరింది. ఇక సెప్టెంబర్‌‌లో డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర (domestic cylinder price) 25 రూపాయలు పెరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ నెలలో 19కేజీల కమర్షియల్‌ సిలిండర్‌ ధర (Commercial cylinder price) రూ.43 పెరిగింది. తాజాగా పెరిగిన వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మొత్తం గ్యాస్‌ ధర రూ.190 దాకా పెరిగింది.  


Also Read : Viral News:ఎలక్ట్రానిక్ వస్తువులు ఆర్డర్ చేస్తే 'ఇటుక, డెటాల్, గడీ సోప్' వచ్చాయి


చమరు కంపెనీలు రెండు నెలల్లో నాన్‌ సబ్సిడీ గ్యాస్‌ సిలీండర్‌ ధరలు పెంచేశాయి. ఆగస్ట్‌ 18న నాన్‌ సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్‌ ధర (Non-subsidized gas cylinder price) ను రూ.25 పెంచగా.. సెప్టెంబర్‌‌లో ఇదే నాన్‌ సబ్సీడీ గ్యాస్‌ సిలిండర్‌ ధరను (gas cylinder price) రూ.25 పెంచారు. అలాగే బుధవారం మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ కూడా పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌పై (Petrol‌) 30 పైసలు, డీజిల్‌పై (Diesel‌) 35 పైసలు పెరగడంతో కొత్త గరిష్ఠాలను చేరాయి. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర 102.94, డీజిల్‌ ధర రూ.91.42కు చేరింది. ఇక ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.108.96, డీజిల్‌ ధర రూ.99.17గా ఉంది. హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.107.09, డీజిల్‌ రూ.99.75, గ్యాస్‌ రూ.952.00గా ఉంది.


Also Read : Telangana RTC: ఆర్టీసీ సరికొత్త సేవలు, ఫోన్ చేస్తే ఇంటి వద్దకే బస్సు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook