అయోధ్యలో రామాల‌య నిర్మాణంలో భాగంగా ఆగ‌స్టు 5వ తేదీన భూమి పూజ చేసేందుకు అంతా సిద్ధం చేశారు. అయితే అయోధ్యలో కరోనా వైరస్ (CoronaVirus At Ram Temple in Ayodhya) కలవరం రేపుతోంది.  విష‌యం తెలిసిందే. భూమి పూజ (Ram Temple in Ayodhya) కోసం విధులు నిర్వహించే పోలీసులతో పాటు కార్యక్రమం నిర్వహించే పూజారులకు ముందు జాగ్రత్తగా కోవిడ్19 టెస్టులు నిర్వహించారు. ఓ పూజారితో పాటు మరో 14 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. Ram Temple: టైమ్ క్యాప్సుల్‌ నిజమేనా? ట్రస్ట్ ఏం చెబుతోంది? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే ప్రతిష్టాత్మక కార్యక్రమం కావడంతో టెస్టులు నిర్వహించగా అయోధ్య భూమి పూజ, విధుల్లో పాల్గొనే వారికి కరోనా రావడం కలకలం రేపుతోంది. నలుగురు పూజారులు భూమిపూజ చేయనుండగా.. అందులో ఒకరైన ప్రదీప్ దాస్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. శిష్యుడికి కరోనా పాజిటివ్ రావడంతో గురువు స‌త్యేంద్ర దాస్ హోం క్వారెంటైన్‌లోకి వెళ్లారు. IPL ఫైనల్ తేదీ మార్పు.. 13 ఏళ్లలో తొలిసారిగా!


ఆగస్టు 5 అయోధ్యలో భూమి పూజ నేపథ్యంలో పలు మీడియా ప్రతినిధులు ప్రదీప్ దాస్‌ను కలుసుకుని ఇంటర్వ్యూలు చేశారు. వీరందరూ టెస్టులు చేపించుకోవాల్సి ఉంటుంది. పోలీసులను సైతం ఇటీవల కలిసిన ప్రాథమిక కంటాక్ట్ ఉన్నవారు కోవిడ్19 టెస్టులు చేపించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. Apsara Rani థ్రిల్లర్ ట్రైలర్.. హాట్ సీన్లతోనే కథ!


సీఎం యోగి ఆదిత్యనాత్ గత శనివారం అయోధ్యలో రామజన్మభూమి స్థలానికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించడం తెలిసిందే. ఆ సమయంలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు పక్కనే పూజారి ప్రదీప్ దాస్ నిల్చుని ఫొటోలలో కనిపించారు. ప్రస్తుతం అయోధ్యలో 375 యాక్టీవ్ కేసులండగా, మొత్తం యూపీలో 29,997 కేసులున్నాయి. Photos: బుల్లితెర రారాణి అంకితా లోఖాండే.. 


వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్