IPL ఫైనల్ తేదీ మార్పు.. 13 ఏళ్లలో తొలిసారిగా!

ఈ ఏడాది ఐపీఎల్ దాదాపు ఆరు నెలలు ఆలస్యంగా మొదలవుతోంది. యూఏఈ వేదికగా నిర్వహించనున్న ఈ ఐపీఎల్ ఫైనల్ తేదీ (IPL 2020 Final Date)ని భిన్నంగా ప్లాన్ చేస్తున్నారు.

Last Updated : Jul 30, 2020, 01:44 PM IST
IPL ఫైనల్ తేదీ మార్పు.. 13 ఏళ్లలో తొలిసారిగా!

ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) దాదాపు ఆరు నెలలు ఆలస్యంగా మొదలవుతోంది. కరోనా వ్యాప్తి కారణంగా భారత్‌లో సాధ్యంకాని పక్షంలో ఈసారి లీగ్‌ను యూఏఈ వేదికగా నిర్వహించనున్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆమోదంతో సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు క్యాష్ రిచ్ టీ20 లీగ్ నిర్వహించేందుకు షెడ్యూల్ ప్లాన్ చేశారు. అయితే ఫైనల్ తేదీ (IPL 2020 Final Date)లో మార్పులు చోటుచేసుకోవచ్చునని తెలుస్తోంది. IPL 2020: భారత ప్రభుత్వం ఆమోదం కోసం ఎదురుచూపులు

నవంబర్ 8కి (ఆదివారం) నిర్ణయించిన ఐపీఎల్ 13 ఫైనల్‌ మ్యాచ్ (IPL 2020 Final Date)‌ను నవంబర్ 10కి మార్చనున్నారని కథనాలు వస్తున్నాయి. గత 12 సీజన్లలో కేవలం వీకెండ్‌లోనే ఐపీఎల్ ఫైనల్ నిర్వహించారు. కానీ ప్రస్తుతం వారంతంలో కాకుండా వారం మధ్యలో ఐపీఎల్ 2020 ఫైనల్ తేదీని ఖరారు చేయాలని బ్రాడ్‌కాస్టర్ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. IPL 2020: క్రికెటర్ల వెంట లవర్స్‌, బీసీసీఐ దారెటు?

తొలుత సెప్టెంబర్ 26 నుంచి ఐపీఎల్ 2020 ప్రారంభించాలని నిర్ణయించగా.. ఫ్రాంచైజీలు, బ్రాడ్‌కాస్టర్ డిమాండ్ చేయడంతో పాటు వ్యాపార కారణాల రీత్యా మరో వారం షెడ్యూల్ పొడిగించడం తెలిసిందే. దాంతో సెప్టెంబర్ 19నుంచే ఐపీఎల్ ఆరంభించేలా షెడ్యూల్ చేశారు. ప్రస్తుతం డల్‌గా ఉన్న బిజినెస్‌కు ఊపు తెచ్చేందుకు, యాడ్స్‌(ప్రకటనలను) మరింతగా క్యాష్ చేసుకునేందుకు వారం మధ్యలోనే (నవంబర్ 10న) ఐపీఎల్ ఫైనల్ జరపాలని పట్టుబడుతున్నారు. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos  

దాదాపు నెల రోజుల ముందే అంటే.. ఆగస్టు 20 నాటికి క్రికెటర్లు యూఏఈకి చేరుకోవాల్సి ఉంటుంది. క్వారంటైన్‌లో ఉంచి ఆటగాళ్లను మ్యాచ్‌లకు సిద్ధం చేస్తారు. వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్  

Trending News