Kala Bhairava Temple: కలల ప్రాజెక్టు కాశీ విశ్వనాథ్ థామ్ ప్రారంభోత్సవం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. ఈ సందర్భంగా కాశీ చేరుకున్న మోదీ..కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గమైన వారణాసిలో ప్రధాని చేతుల మీదుగా కాశీ విశ్వనాథ్ థామ్(Kasi Viswanath Dham)ప్రారంభం కానుంది. దివ్య కాశీ- భవ్యకాశీ పేరిట జరగనున్న ఈ కార్యక్రమం నిమిత్తం కాశీ పట్టణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. తొలిదశలో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన 23 భవనాల్ని మోదీ ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 51 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది. దేశంలోని ప్రముఖ శివాలయాలు, ఆశ్రమాల్లో ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటయ్యాయి. ఈ కార్యక్రమం కోసం వారణాసి చేరుకున్న ప్రధాని మోదీ(PM Modi)విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముందుగా కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాలభైరవుడికి హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమం పురస్కరించుకుని వారణాసి నగరమంతా ప్రత్యేకంగా అలంకరించారు. 


Also read: Corona cases in India: దేశంలో తగ్గుతున్న కరోనా తీవ్రత- 561 రోజుల కనిష్ఠానికి యాక్టివ్​ కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook