Modi Youtube Channel: సాధారణ యూట్యూబర్‌లా తన యూట్యూబ్ చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని ఈ మధ్యనే మోదీ తన ప్రసంగంలో రిక్వెస్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మరిన్ని అప్‌డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను క్లిక్ చేసి పెట్టుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరడం అప్పట్లో కోట్లాదిమంది భారతీయులను ఆశ్చర్యపరిచింది. 
అయితే ఆయన అభ్యర్థన ఊరికే పోలేదు. ఆయన చేసిన అభ్యర్థన ఆయన్ని చరిత్రలో నిలిచేలాగా చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రధాని మోదీ ఓ అరుదైన రికార్డును సృష్టించారు . తన యూట్యూబ్ ఛానల్ లో నరేంద్ర మోదీ రెండు కోట్ల మంది సబ్స్క్రైబర్లను పొంది.. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి నేతగా చరిత్రలో నిలిచారు.  కాగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు లైవ్ కార్యక్రమాలను మోదీ పోస్ట్ చేస్తుంటాడు.


ఇందులో భాగంగా ప్ర‌పంచ దేశాధినేత‌ల్లో మోదీ ఛాన‌ల్‌కు అత్య‌ధిక స్థాయిలో స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నారు. మోదీ యూట్యూబ్ ఛాన‌ల్‌ను 2007లో క్రియేట్ చేశారు. ఆయన గుజ‌రాజ్ సీఎంగా ఉన్న స‌మ‌యంలోనే ఈ యూట్యూబ్ ఛాన‌ల్‌ను స్టార్ట్ చేశారు. 2019లో కాశీ ప‌ర్య‌ట‌న స‌మ‌యంలో దివ్యాంగులు ఆయ‌న‌కు వెల్క‌మ్ చెప్పిన వీడియోను మోడీ షేర్ చెయ్యగా ఆ వీడియో అత్య‌ధికంగా చూశారు. 


ఇక 2019లోనే అప్ప‌టి ఇస్రో చైర్మెన్ కేశివ‌న్‌తో భావోద్వేగానికి లోనైన వీడియోని కూడా మోదీ తన యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేయగా ఆ వీడియో కి కూడా అధిక సంఖ్య‌లో వ్యూవ్స్ వ‌చ్చాయి. ఇక ఆ తరువాత బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్‌తో చేసిన ఇంట‌ర్వ్యూను కూడా ఎక్కువ మందే చూశారు. మొత్తం పైన ఇలాంటి వీడియోలు ఎన్నో చేస్తూ మోడీ తన యూట్యూబ్ ఛానల్ ని ప్రత్యేకంగా నిలిపాడు.


ముఖ్యంగా మోడీ తన చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా డైరెక్ట్ గా తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేయడం వల్ల విలువైన సమాచారం మన భారతీయులందరికీ తొందరగా చేరుతున్న సంగతి తెలిసిందే. ఇక తన స్పీచ్ లతో మన అందరిని ఎంతగానో ఆకట్టుకున్న మోదీ ఇప్పుడు ఇలా రెండు కోట్ల మంది సబ్స్క్రైబర్లను తెచ్చుకొని ప్రపంచంలోనే ఈ రికార్డు సాధించిన తొలి నేతగా నిలవడం భారతదేశానికి గర్వకారణం అంటూ ఎంతోమంది కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలు అభిమానులు ట్విట్టర్ లో మోడీని అభినందిస్తూ పోస్టులు షేర్ చేస్తున్నారు. 


Also read: Corona New Variant Jn.1: దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, 17 రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదు


Also read: India Covid Cases Today: ఒక్క రోజులో భారీగా పెరిగిన కరోనా కేసులు.. మొత్తం ఎన్ని కేసులంటే..?


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook