Modi G 20:ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జీ 20 సదస్సు కోసం బ్రెజిల్ రాజధాని రియో డి జనిరోకి వెళ్లారు. అంతకు ముందు ఆయన ఆఫ్రికన్ దేశమైన నైజీరియా వెళ్లారు. అంతేకాదు అక్కడ ఆ దేశ రెండో అత్యున్నత పురస్కారం అందుకున్నారు. అంతేకాదు ఆ దేశంతో పాలు పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ తర్వాత బ్రెజిల్ ో ఫ్రాన్స్ అధ్యక్షుడితో భేటి అయ్యారు. అక్కడ తన స్నేహితుడు, అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ను కలవడం ఎంతో ఆనందంగా  ఉందన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్‌, ఫ్రాన్స్‌లు అంతరిక్షం, ఇంధనం, ఏఐ వంటి ఇతర రంగాలలో సన్నిహితంగా పనిచేయడంపై చర్చించామన్నారు. ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలను బలపరిచేందుకు పనిచేస్తామని మోదీ ఎక్స్‌ వేదికగా తెలిపారు. ఈ ఇయర్  ప్రారంభంలో పారిస్‌ వేదికగా  జరిగిన ఒలింపిక్స్‌ను సమర్థంగా నిర్వహించారని మెక్రాన్‌ను మోడీజీ  ప్రశంసించారు.. ఈ సమావేశం భారత్‌- ఫ్రాన్స్‌ వ్యూహాత్మక భాగస్వామ్యంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అభివర్ణించింది.


బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ తోను నరేంద్ర మోడీ చర్చించారు. రిషీ సునాక్.. ఇంగ్లాండ్ లో మధ్యంతరానికి వెళ్లడంతో దారుణంగా ఓడిపోయారు. దీంతో ప్రతిపక్షం అధికారంలోకి వచ్చింది. అంతేకాదు ప్రధాన మంత్రిగా కీర్ స్టార్మర్ తో భేటి అయ్యారు. అంతేకాదు ఇంగ్లాండ్ తో రాబోయే కాలంలో సాంకేతికత, గ్రీన్‌ఎనర్జీ,  భద్రత, ఆవిష్కరణ వంటి రంగాల్లో బ్రిటన్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామన్నారు. వాణిజ్యంతో పాటు సాంస్కృతిక సంబంధాలను సైతం బలపరచాలనుకుంటున్నామని ప్రధాని తెలిపారు. మరోవైపు ఇటలీ, యూకే, ఇండోనేషియా, నార్వే, పోర్చుగల్‌తో సహా పలు దేశాధినేతలతోను మోడీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter