Lockdown: కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. దేశంలో కరోనా థర్డ్‌వేవ్ ప్రారంభమైపోయింది. భారీగా కేసులు నమోదవుతుండటంతో లాక్‌డౌన్ విధించే విషయమై ప్రధాని మోదీ ఇవాళ నిర్ణయం తీసుకోనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఊహించిందే జరిగింది. కరోనా థర్డ్‌వేవ్ దేశంలో మొదలైపోయింది. ఈ దిశగా ఇప్పటికే వైద్య నిపుణులు, ఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశంలో రోజుకు 10 వేల కేసుల నుంచి ఒక్కసారిగా లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. వరుసగా మూడవ రోజు కూడా దేశంలో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో 1 లక్షా 59 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. అటు కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 5 లక్షల 90 వేల 611కు చేరింది. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 98.36 శాతం కాగా, రోజువారీ పాజిటివిటీ రేటు 10.21కు చేరుకుంది. అటు దేశలో ఇప్పటి వరకూ నమోదైన ఒమిక్రాన్ (Omicron) కేసులు 3 వేలకు పైగా ఉన్నాయి.


కరోనా కేసులు పెరుగుతుండటంతో పరిస్థితి చేయిదాటుతోంది. దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే నైట్‌కర్ఫ్యూ (Night Curfew) లేదా వివిధ రకాల ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) కరోనా పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు జరగనున్న సమీక్షలో వైద్య నిపుణులు, కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. దేశంలో లాక్ డౌన్ విధించే విషయంలో సానుకూల, ప్రతికూల పరిణామాలు విశ్లేషించి..ఓ నిర్ణయం తీసుకోనున్నారు. 


Also read: NEET PG Counselling 2021: నీట్ పీజీ అభ్యర్థులకు అలర్ట్... కౌన్సెలింగ్ ఎప్పుడంటే...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి