Two thousand note: డీ మోనిటైజేషన్. దేశంలోనే ఓ సంచలన నిర్ణయం. వేయి రూపాయల నోటు పోయి 2 వేల రూపాయల నోటు వచ్చిన తరుణం. చాలాకాలంగా రెండువేల రూపాయల నోటు రద్దు చేస్తారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. కేంద్రం చెప్పిన సమాధానం అర్ధం అదేనా మరి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో పెద్దనోట్లను ఒక్కసారిగా రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం(Central government) తీసుకున్న నిర్ణయం ఇప్పటికీ సంచలనమే. వేయి రూపాయలు, ఐదు వందల రూపాయల నోట్లను ఒక్కసారిగా రద్దు చేసింది. తరువాత 5 వందలు, 2 వందల రూపాయల కొత్త నోట్లతో పాటు రెండు వేల రూపాయల నోటును ప్రవేశపెట్టింది. బ్లాక్‌మనీ(Black money)ను అరికట్టే ఉద్దేశ్యంతోనే పెద్దనోట్లను రద్దు చేశామని చెప్పింది ప్రభుత్వం. అయితే రెండు వేల నోటును ఎందుకు తీసుకొచ్చిందనేది ఇప్పటికీ అర్ధం కాని ప్రశ్న. చాలాకాలంగా రెండు వేల రూపాయల నోటు కూడా రద్దు చేస్తారనే వార్తలు స్పెక్యులేట్ అవుతున్నాయి. ఈ వార్తల్ని కేంద్ర మంత్రులు కొట్టిపారేసిన సందర్భం కూడా ఉంది. రెండు వేల రూపాయల నోటు రద్దు చేస్తారనే స్పెక్యులేషన్స్‌కు బలం చేకూర్చేలా మార్కెట్‌లో పెద్దగా ఈ నోటు కన్పించడం లేదు కూడా. ఈ నేపధ్యంలో లోక్‌సభ సమావేశాల్లో సభ్యులు ఇదే అంశంపై అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాగూర్ (Anurag Thakur) చెప్పిన సమాధానం ఆశ్చర్యపర్చింది. స్పెక్యులేషన్స్ నిజమేనా అనే వాదనకు దారి తీస్తోంది.


2016లో తొలిసారి చలామణిలోకి వచ్చిన 2 వేల రూపాయల నోటు ముద్రణను నిలిపివేసినట్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అది కూడా రెండేళ్లుగా 2 వేల రూపాయల నోటును (Two thousand rupees note) ముద్రించడం లేదని కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్(Anurag Thakur) లిఖితపూర్వకంగా స్పష్టం చేశారు.  2018 మార్చ్ 30 నాటికి దేశంలో 336.2 కోట్ల విలువైన రెండు వేల రూపాయల నోట్లు చెలామణిలో ఉన్నాయని..2021 ఫిబ్రవరి 26 నాటికి ఆ సంఖ్య 249.9 కోట్లకు తగ్గిందని మంత్రి చెప్పారు. లావాదేవీల డిమాండ్ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ(RBI)తో సంప్రదించి నిర్ణయం తీసుకుంటుందని మంత్రి తెలిపారు. ఎందుకు నిలిపివేశారనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. 


Also read: Tamilnadu Assembly Elections 2021: ఆల్ ఫ్రీ మేనిఫెస్టో విడుదల చేసిన అన్నాడీఎంకే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook