దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ( CoronaVirus In India) పెరుగుతుంటే టెస్టుల సంఖ్య పెంచి సాధ్యమైనంత త్వరగా చికిత్స ప్రారంభించాలని, దాంతో పాటు ఇతరులకు సోకకుండా వ్యాప్తి చేయవచ్చునని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అయితే ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ చేసిన పని అధికారులకు, పోలీసులకు ఆగ్రహాన్ని తెప్పించింది. డబ్బులు తీసుకుని ఫేక్ కరోనా నెగటివ్ రిపోర్టులు (Fake Corona Reports) ఇవ్వడం కలకలం రేపుతోంది. యూపీలోని మీరట్ జిల్లాలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ పేషెంట్ల వద్ద నగదు వసూలు చేసి కరోనా నెగటివ్ అని రిపోర్ట్ ఇచ్చిన ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్యలు తీసుకున్నారు. ఒక్కరోజులో 24,248 కరోనా కేసులు.. అదొక్కటే ఊరట


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీరట్ జిల్లా మేజిస్ట్రేట్ అనిల్ ధింగ్రా దీనిపై స్పందించారు. మీరట్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ డబ్బులు తీసుకుని కరోనా నెగటివ్ అని రిపోర్టు ఇవ్వడం మా దృష్టికి వచ్చింది. దీంతో నర్సింగ్ హోమ్ లైసెన్స్ రద్దు చేశాం. హాస్పిటల్‌ను ఆదివారం సీజ్ చేసినట్లు తెలిపారు. రూ.2,500 తీసుకుని ఫేక్ కరోనా రిపోర్టులు (Fake COVID19  Reports) ఇస్తున్నారు. ఇలాంటి పనులు చేయడం నేరం. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్యారెట్ తింటే ఈ 10 ప్రయోజనాలు తెలుసా!


డబ్బులు తీసుకుని ఇలాంటి పనులు చేస్తున్న వ్యక్తులను గుర్తించాం, కేసు కూడా నమోదైందని మీరట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. రాజ్‌కుమార్ తెలిపారు. ముందుగా రూ.2000 వసూలు చేస్తున్నారు, ఫేక్ కరోనా రిపోర్ట్ తీసుకునే సమయంలో మిగతా రూ.500 ఇచ్చేలా ఒప్పందం చేసుకున్న వీడియో వైరల్ కావడంతో ఈ తతంగం వెలుగు చూసిందన్నారు. ‘ఆ గడువులోగా కరోనా వ్యాక్సిన్ రావడం కష్టమే’


కాగా, మీరట్ జిల్లాలో ఇప్పటివరకూ 1,117 కరోనా కేసులు నమోదు కాగా, 69 మంది కోవిడ్19తో పోరాడుతూ చనిపోయారు.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos