Central government: జార్ఖండ్‌లో న్యాయమూర్తి హత్యోదంతంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో మరోసారి ఆ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. ఇప్పుడు న్యాయమూర్తుల రక్షణ విషయమై కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జార్ఖండ్ న్యాయమూర్తి హత్యకేసు(Jarkhand judge murder case) విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని..దీనికి సంబంధించి వివరాలు సమర్పించాలని ఇంతకుముందు ఆదేశించింది. దీనికి సమాధానంగా కేంద్ర ప్రభుత్వం (Central government)సంచలన వ్యాఖ్యలు చేసింది. 


న్యాయమూర్తుల రక్షణకు సంబంధించి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్(CISF)వంటి భద్రతా సంస్థ ఏర్పాటు సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. అసలీ అంశం సలహా ఇవ్వదగిందే కాదని తెలిపింది. న్యాయమూర్తుల భద్రతకు సంబంధించిన హోంశాఖ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపింది. ప్రత్యేకమైన పోలీసు వ్యవస్థ కాకుండా కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల్ని రాష్ట్రాలు అమలు చేస్తే చాలని పేర్కొంది. న్యాయమూర్తులు, న్యాయవాదుల భద్రతకు సంబంధించి ఎలాంటి రక్షణ తీసుకుంటున్నారనేది పదిరోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశించింది. గత విచారణ సమయంలోనే దాఖలు చేయాల్సి ఉన్నా చేయకపోవడంతో ఆయా రాష్ట్రాలకు లక్ష రూపాయల జరిమానా విధించింది సుప్రీంకోర్టు. 


Also read: Facebook on Talibans: తాలిబన్‌పై నిషేధం విధించిన ఫేస్‌బుక్, ఇదే కారణం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి