Uttar pradesh Elections 2022: ఉత్తరప్రదేశ్ ఎన్నికల వేడి ఏడాది ముందే రాజుకుంది. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ఏర్పాట్లకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ యూపీ బాధ్యతల్ని తీసుకోనున్నారు. మిషన్ యూపీ ఇప్పుడు ప్రియాంక బాధ్యతగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిషన్ యూపీ (Mission UP)కార్యక్రమాన్ని చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. దేశవ్యాప్తంగా అందరికీ ఆసక్తి కల్గించే ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా..ఎన్నికల వేడి అప్పుడే రాజుకుంది. కాంగ్రెస్ పార్టీ ఏడాది ముందే ఏర్పాట్లకు సిద్ధమవుతోంది. పార్టీలో గ్రౌండ్ జీరో నుంచి పనిచేసేందుకు వీలుగా..ప్రియాంక గాంధీ రంగంలో దిగనున్నారు. లక్నోలో ఉంటూ ఎన్నికల వరకూ పర్యవేక్షించనున్నారు.


ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు(Uttar pradesh Elections 2022) అన్ని పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. లక్నో వేదికగా యూపీ బాథ్యతల్ని ప్రియాంక గాంధీకు అప్పగించారు. రాష్ట్రంలోని చిత్రకూట్ జిల్లా నుంచి ప్రియాంక గాంధీ యాత్ర (Priyanka Gandhi yatra) జూలై నెలలో ప్రారంభం కానుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రియాంక యాత్ర షెడ్యూల్ ఖరారు చేసే పనిలో పార్టీ వర్గాలు నిమగ్నమయ్యాయి. సమాజ్‌వాద్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ నుంచి దూరంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే బరిలో దిగవచ్చని తెలుస్తోంది. పార్టీ నేతల విషయంలో కూడా యూపీలో కాంగ్రెస్ పార్టీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే సీనియర్ నేతలు పార్టీ వీడి ఇతర పార్టీల్లో చేరిపోయారు. రాష్ట్రంలో మొత్తం 403 స్థానాల్లో అభ్యర్ధులు లభిస్తారా అనేది సందేహంగానే మారింది. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సమాజ్‌వాద్ పార్టీతో కలిసి కూటమి ఏర్పడినా పార్టీ ఘోరంగా విఫలమైంది. కేవలం 7 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ (Congress party)విజయం సాధించింది. అటు ఎస్పీ మాత్రం 47 స్థానాల్ని గెల్చుకుంది. ఈ నేపధ్యంలో 2022లో జరిగే యూపీ ఎన్నికలకు సిద్ధం కావాలంటే పార్టీ చాలా గట్టిగా ప్రయత్నించాల్సి ఉంటుంది. యూపీ బాధ్యతల్ని తీసుకున్న ప్రియాంక గాంధీకు(Priyanka Gandhi) నిజంగా ఇది పెద్ద సవాలే.


Also read: Union Cabinet Meet: ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ, మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook