సోనియాగాంధీ కుమార్తె, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి  ప్రియాంక గాంధీ ప్రధాని మోడీ పై పోటీకి రెడీ అంటున్నారు. పార్టీ ఆదేశిస్తే తప్పకుండా  నరేంద్ర మోడీ పై పోటీ చేస్తానని మరోమారు ప్రకటించారు.  మీడియా సమావేశంలో ఓ విలేఖరి అడిగిన ప్రశ్నలకు  ప్రియాంక ఇలా బదులిచ్చారు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పార్టీ అదేశిస్తే పోటీకి సై....


అమేథి ఎన్నికల ప్రచారంలో ప్రియాంకను సోనియా ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథి నుంచి బరిలోకి దిగాలని కార్యకర్తలు కోరగా... ఏం వారాణసీ నుంచి వద్దా..?...చెప్పండి... వారాణసీ నుంచి పోటీచేయనా ? వద్దా’ అని కార్యకర్తలకు ప్రియాంక నవ్వుతూ అడిగారు. ఈ క్రమంలో ఈ రోజు మీడియా నుంచి ప్రియాంకకు ఈ ప్రశ్న ఎదురైంది. ప్రధాని మోడీ బరిలో ఉన్న వారణాసి నుంచి పోటీకి దిగుతున్నారా  అన్న ప్రశ్నకు బదులిస్తూ పార్టీ అదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని.. ఒక వేళ  మోడీపై  పోటీ  చేయనమని ఆదేశిస్తే రెడీ అంటూ ప్రియాంక  బుదలిచ్చారు.


పాక్ లో మోడీ బిర్యాని తిన్నారు కదా..


కాంగ్రెస్ పార్టీ పై ప్రధాని మోడీ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పాక్ లో సంబరాలు చేసుకుంటుని ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు సంధించారు. ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్న ప్రధాని మోడీ... పాక్ కు వెళ్లి బిర్యాని తిన్న విషయాన్ని మరిచిపోయినట్లు ఉన్నారని ఎద్దేవ చేశారు. గత ప్రధాని నవాజ్ షరీర్ ఇంట్లో ఏర్పడు చేసిన విందుకు వెళ్లిన అంశాన్ని ఈ సందర్భంగా ప్రియాంక ప్రస్తావించారు