Bhagwant Mann: పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం... కొత్త మంత్రులకు షాకింగ్ న్యూస్..
Arvind Kejriwal on CM Bhagwant Mann:ప్రమాణస్వీకారం చేసిన మూడు రోజుల్లోనే భగవంత్ మాన్ కొన్ని మంచి పనులు చేశారని... అందుకు తాను గర్వపడుతున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశమంతా భగవంత్ మాన్, ఆయన చేస్తున్న పనుల గురించే ఆలోచిస్తున్నారని అన్నారు.
Arvind Kejriwal on CM Bhagwant Mann: ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ లాగే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా పాలనలో తనదైన మార్క్ చూపించేలా అడుగులు వేస్తున్నారు. కొత్తగా కొలువుదీరిన కేబినెట్ మంత్రులకు సీఎం భగవంత్ మాన్ టార్గెట్స్ ఫిక్స్ చేశారు. అంతేకాదు, ఒకవేళ టార్గెట్స్ పూర్తి చేయనిపక్షంలో సదరు మంత్రులను కేబినెట్ నుంచి తప్పిస్తానని తేల్చి చెప్పారు. ఆప్ అధినేత కేజ్రీవాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. భగవంత్ మాన్ నిర్ణయంతో మంత్రులు ప్రజలకు జవాబుదారీగా ఉంటారని పేర్కొన్నారు.
'కేబినెట్‌లోని ప్రతీ మంత్రికి సీఎం భగవంత్ మాన్ కొన్ని టార్గెట్స్ ఇవ్వనున్నారు. నిర్ణీత వ్యవధిలో వారు టార్గెట్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం రాత్రింబవళ్లు పనిచేయాలి. ఒకవేళ లక్ష్యాలను చేరుకోవడంలో మంత్రులు విఫలమైతే.. సదరు మంత్రులను మార్చాల్సిందిగా ప్రజలే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు.' అని అరవింద్ కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.
ప్రమాణస్వీకారం చేసిన మూడు రోజుల్లోనే భగవంత్ మాన్ కొన్ని మంచి పనులు చేశారని... అందుకు తాను గర్వపడుతున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశమంతా భగవంత్ మాన్, ఆయన చేస్తున్న పనుల గురించే ఆలోచిస్తున్నారని అన్నారు. గతేడాది అక్టోబర్‌లో దెబ్బ తిన్న పంటలకు తాజాగా భగవంత్ మాన్ పంట నష్టం పరిహారాన్ని విడుదల చేశారని.. రాబోయే రోజుల్లో రైతులకు చెక్కులు అందుతాయని చెప్పారు.
ఇటీవలి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 117 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 92 స్థానాల్లో విజయం సాధించింది. సీఎంగా ఆప్ నేత భగవంత్ మాన్ బాధ్యతలు చేపట్టారు. శనివారం (మార్చి 19) 10 మంది మంత్రులతో కూడిన కొత్త కేబినెట్ కొలువుదీరింది. కొత్త మంత్రులకు సీఎం భగవంత్ మాన్ టార్గెట్స్ ఫిక్స్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Also read: రాజమౌళికి సానుభూతి ఉండదు.. ఆరోగ్యం బాగాలేకపోయినా నాతో షూటింగ్ చేపించారు! స్టార్ హీరో ఫిర్యాదు!!
Also read: SS Rajamouli: ఇంకో 'ఆర్ఆర్ఆర్' సినిమా కూడా ఉంది.. అంతకుమించి కామెడీ ఉంటుంది: రాజమౌళి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook