Jobs Notificaion in Punjab: పంజాబ్‌లో సంచలనం విజయం సాధించిన ఆప్.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త మంత్రివర్గం కొలువుదీరిన కాసేపటికే భారీగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో 25 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆమోదముద్ర వేస్తూ తొలి కేబినెట్‌లోనే సీఎం మాన్ నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్‌లో వివిధ శాఖలు, బోర్డులు, కార్పొరేషన్లలో ఉద్యోగాలు ఖాళీలగా ఉన్నట్లు గుర్తించామన్నారు.  వీటిలో 10 వేల ఉద్యోగాలు పోలీస్ శాఖలో, మిగతా 15 వేల పోస్టులు ఇతర శాఖల్లో భర్తీ చేస్తారు. ఉద్యోగ ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ రానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పంజాబ్‌లో నిరుద్యోగ సమస్యనే ప్రధానంగా లేవనెత్తిన ఆప్.. తమకు అధికారం ఇస్తే వాటిని భర్తీ చేస్తామని హామీని ఇచ్చారు. ఎన్నికల హామీని నెరవేర్చడమే తమ ధ్యేయమని సీఎం భగవంత్ మాన్ తెలిపారు. మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు ఇస్తామన్నారు. వీటిలో ఎలాంటి వివక్ష, సిఫార్సులు, అవినీతికి తావు ఉండదని స్పష్టం చేశారు. తొలి కేబినెట్‌లో ఉద్యోగాల భర్తీతోపాటు ఇతర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలోనే మరిన్ని కీలక నిర్ణయాలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 


ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ విజయఢంకా మోగించింది. ప్రధాన పార్టీలను సైతం మట్టి కరిపించి భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీని విస్తరిస్తామని ఇప్పటికే ఆప్‌ నేతలు తెలిపారు. జాతీయ పార్టీగా ఆవిర్భవిండమే తమ లక్ష్యమంటున్నారు. త్వరలో తెలంగాణలోనూ ఆ పార్టీ పాదయాత్ర చేయనుంది. ఇప్పటికే రోడ్‌ మ్యాప్‌ సైతం సిద్ధమైనట్లు తెలుస్తోంది. పాదయాత్రల్లో ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పాల్గొంటారని ఆప్‌వర్గాలు చెబుతున్నాయి.


Also Read: RRR Movie Tickets: గ్యాస్ సిలిండర్ తీసుకుంటే.. ఉచితంగా ఆర్ఆర్ఆర్ మూవీ టిక్కెట్లు! ఎక్కడో తెలుసా?!!


Also Read: Shalini Pandey Pics: అర్జున్​ రెడ్డి బ్యూటీ షాలినీ పాండే లేటెస్ట్ ఫొటోలు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook