Sidhu Moosewala murder: ముగిసిన సిద్ధూ మూసేవాలా అంత్యక్రియలు, వేలాదిగా తరలివచ్చిన అభిమానులు.
Sidhu Moosewala murder: గ్యాంగ్‌వార్‌కు బలైన పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో ముగిసాయి. భారీగా హాజరైన అభిమానులు సిద్ధూకు అంతిమవీడ్కోలు పలికారు. అటు సిద్ధూ అటాప్సీ రిపోర్ట్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి.
Sidhu Moosewala murder: ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురైన పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా అంత్యక్రియలు ముగిసాయి. అతని స్వగ్రామం మాన్సా జిల్లా మూసా గ్రామంలో వేలాదిమంది అభిమానుల అశ్రునయనాల మధ్య సిద్ధూకు తుదివీడ్కోలు పలికారు. ఆయన అంత్యక్రియల్లో పంజాబ్ పీసీసీ అధ్యక్షునితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు, పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. సిద్ధూకు ఇష్టమైన 5911 ట్రాక్టర్‌లో అతని పార్థీవదేహానికి అంతిమయాత్ర నిర్వహించారు.
అటు సిద్ధూ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి. సిద్ధూ ను ప్రత్యర్థులు అత్యంత దారుణంగా హత్య చేసినట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తేలింది. తూటాలతో సిద్ధూ శరీరాన్ని అతని ప్రత్యర్థులు జల్లెడ చేసినట్లు డాక్టర్లు తెలిపారు. ఆయన శరీరంపై 24 చోట్ల బుల్లెట్ గాయాలైనట్లు చెప్పారు. దుండగులు కేవలం రెండు నిమిషాల్లోనే 30 రౌండ్ల ఫైరింగ్ చేశారు. అందులో 24 బుల్లెట్లు సిద్ధూ మూసేవాలా శరీరంలోకి దూసుకెళ్లాయి. వాటిని సిద్ధూ డెడ్‌బాడీ నుంచి రికవరీ చేశారు.
సిద్ధూ హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఈ హత్యతో ప్రమేయమున్న ఒకర్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఈ హత్య తామే చేశామని లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్ ప్రకటించుకుంది. అయితే పోలీసులు ఈ గ్రూప్ తో పాటు కెనడా గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ పై కూడా అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ మేరకు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
Also read : Maharashtra: కుటుంబ కలహాల నేపథ్యంలో... ఆరుగురు పిల్లలను బావిలోకి తోసి చంపిన తల్లి!
Also read : Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు... మరో కశ్మీర్ పండిట్ హత్య...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి