Pushpa 2 screening disrupted in Mumbai mysterious spray: పుష్ప2 ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ పేరు మాత్రమే విన్పిస్తుందని చెప్పుకొవచ్చు. ఈ మూవీ విడుదలకు ముందు అనేక రికార్డులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక డిసెంబరు 5న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ విడుదలైంది. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2 మూవీ ఎన్నో ఏళ్ల తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అల్లు అర్జున్, రష్మిక మందన్న ఈ మూవీలో అదరగొట్టారు. ఈ మూవీ విడుదల అయినప్పటి నుంచి ఏదో ఒక వివాదాస్పద అంశంతో  వార్తలలో ఉంటుంది. తాజాగా.. నిన్న (గురువారం) రాత్రి.. జరిగిన ఘటనతో ఆడియన్స్ కొందరు భయంతో పరుగులు తీశారంట. దీంతో మూవీ ప్రదర్శనలో తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తొంది. 


 



పూర్తి వివరాలు.. 


ముంబైలోకి బాంద్రాలోని ఒక థియేటర్ లో పుష్ప 2 మూవీ ప్రదర్శిస్తున్నారు. కాసేపటి వరకు అంత బాగానే ఉంది. కానీ  ఒక్కసారిగా ఆగంతకుడు ఏదో స్ప్రే చేసినట్లు కొంత మంది చెప్పారు. దీంతో  సినిమాకు చూడటానికి వచ్చిన చాలా మంది ప్రేక్షకులు  కళ్లు మండటం, వాంతులు చేసుకొవడం వంటి ఘటనలు జరిగాయంట. దీంతో చాలా మంది భయంతో పరుగులు తీశారంట.


కొందరైతే అక్కడ ఉండలేక.. తోపులాటలో బైటకు వచ్చేశారంట. ఒక్కసారిగా అల్లరికావడంతో సినిమా యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడ ఘటనపై ఆరా తీశారంట. ఆగంతకుడు ఏదో ఘాటైన వాసనను కల్గించే ద్రవాన్ని స్ప్రే చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం విచారణ చేస్తున్నారంట. కాసేపు అంతరాయం తర్వాత సినిమాను యథతథంగా ప్రదర్శించారంట.


Read more: Sobhita Dhulipala: శోభితా మరో సంచలనం.. సమంతను అప్పుడే వెనక్కు నెట్టేసిందిగా.. సోషల్ మీడియాలో ప్రశంసలు..


ఈ ఘటన మాత్రం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. మరోవైపు హైదరబాద్ లోని సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా, శ్రీతేజ్ అనే ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అల్లు అర్జున్ పై, మూవీ టిమ్ పై ఇప్పటికే కేసు నమోదైన విషయం తెలిసిందే.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook