ఢిల్లీలో రాహుల్‌ గాంధీ అధ్యక్షతన అత్యున్నత నిర్ణాయక కమిటీ- కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతోంది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


సార్వత్రిక ఎన్నికల వ్యూహాలే అజెండాగా జరుగుతున్న భేటీకి నూతన  సీడబ్ల్యూసీ సభ్యులు, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. వారం క్రితమే 23 మందితో కొత్త సీడబ్ల్యూసీ ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ ఏడాది చివర్లో జరగనున్న మూడు రాష్ట్రాలతో పాటు వచ్చే ఏడాది జరగనున్న  సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలపై ఈ భేటీలో కీలక చర్చ జరగనుంది.



 


సమావేశానికి అన్ని రాష్ట్రాల పీసీసీలు, సీఎల్పీ నాయకులు, ఇన్‌ఛార్జి జనరల్‌ సెక్రటరీలు, ఇన్‌ఛార్జి సెక్రటరీలు హాజరు కావాలని ఇప్పటికే అధిష్టానం ఆదేశించింది. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు  రాహుల్  పీసీసీలు, ఇన్‌ఛార్జి జనరల్‌ సెక్రటరీలతో భేటీ కానున్నారు. రాబోయే ఎన్నికలు, అభ్యర్థుల ఎంపికకు అనుసరించాల్సిన వ్యూహంపై రాహుల్‌ చర్చించనున్నారు.



 


ప్రస్తుత సీడబ్ల్యూసీలో సోనియా, మన్మోహన్, ఆజాద్, మోతీలాల్‌ వోరా, ఖర్గే, ఏకే ఆంటోనీ, అహ్మద్‌ పటేల్, అంబికా సోనీ తదితరులున్నారు.