Rahul Gandhi, Congress leaders met President Ram Nath Kovind | న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కేంద్ర వ్యవసాయ చట్టాలకు (Farm Laws) వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నెల రోజులుగా ఆందోళన (farmers protest) చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులు చేస్తున్న ఆందోళనకు గురువారం కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలిపింది. ఈ మేరకు రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధి బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ (Ram Nath Kovind) ను కలిసి వినతి పత్రం అందజేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు కోట్ల మంది రైతుల సంతకాలను సేకరించిన మెమోరాండంను రాష్ట్రపతికి అందజేసింది. మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేసే వరకు రైతులు ఆందోళనను విరమించరని.. వీటిని వెనక్కి తీసుకోకపోతే దేశం ఇబ్బందుల్లో పడుతుందని రాహుల్ రాష్ట్రపతికి విన్నవించారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో రాహుల్ గాంధీతోపాటు, గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad ), అధిర్ రంజన్ చౌదరి (Adhir Ranjan Chowdhury) ఉన్నారు.


అనంతరం రాహుల్ గాంధీ (Rahul Gandhi) మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేవలం పెట్టుబ‌డిదారుల కోసం మాత్ర‌మే పనిచేస్తున్నారని ఆరోపించారు. ఆయనకు వ్య‌తిరేకంగా ఎవ‌రు మాట్లాడినా.. వారిని ఉగ్ర‌వాదులుగా ముద్ర వేస్తున్నార‌ని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. భార‌త్‌లో ప్ర‌జాస్వామ్యం లేద‌ని, అది కేవ‌లం ఊహాల్లో మాత్ర‌మే ఉంద‌ని రాహుల్ అన్నారు. వ్యవసాయ చట్టాల రద్దు కోసం న్యాయంగా పోరాడుతున్న రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని రాహుల్ పేర్కొన్నారు. Also read: Farmer protests: రైతులందరూ ఆ లేఖను చదవాలి: ప్రధాని మోదీ


ఈ క్రమంలో రాష్ట్రపతి భవన్‌కు వెళ్తున్న ప్రియాంక గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందే రాష్ట్రపతి భవన్ మార్చ్‌కు అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు. Also read; Farmer protests: వ్యవసాయ చట్టాల ప్రతులను చింపేసిన సీఎం కేజ్రీవాల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook