Rahul Gandhi: దాదాపు దశాబ్దం తర్వాత కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో ప్రతిపక్ష హోదా దక్కింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ధీటుగా ఎదర్కొనే నేతగా ఇప్పటికే కాంగ్రెస్ వర్కింగ్ కమిటి ఈ నెల 9 జరిగిన సమావేశంలో తీర్మానం చేసింది. అయితే రాహుల్ గాంధీ కొంత టైమ్ తీసుకున్నా చివరకు రాహుల్ గాంధీ.. ప్రతిపక్ష నేత బాధ్యతను  స్వీకరించడానికి రెడీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేతగా ఉన్న సోనియా గాంధీ.. లోక్ సభ ప్రొటెం స్పీకర్ కు ఓ లేఖ రాసారు. దాన్ని ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ ఆమోదించారు. ఈ నేపథ్యంలో లోక్ సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీకి పలు కీలక నిర్ణయాల్లో భాగస్వామ్యం దక్కే అవకాశం ఉంది. ఎన్నికల కమిషనర్లు, సమాచార కమిషన్, సీబీఐ, విజిలెన్స్ ఛీఫ్ నియామాల్లో కీ రూల్  పోషించనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాందీ.. కేరళలోని వాయనాడ్ తో పాటు ఉత్తర ప్రదేశ్ లోని రాయబరేలి నుంచి ఎంపీగా గెలిచారు. అయితే .. ఎన్నికై దగ్గర నుంచి 2 వారాల్లో ఏదో స్థానాన్ని ఒదులుకోవాలి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ.. వాయనాడ్ కు రాజీనామా చేసి తన తల్లి ఎన్నో ఏళ్లుగ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయబరేలినే ఎంచుకున్నారు. తాజాగా నిన్న జరిగిన లోక్ సభ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో రాహుల్ గాంధీ.. రాజ్యాంగం పుస్తకం పట్టుకొని ప్రమాణ స్వీకారం చేసారు. రాహుల్ తో పాటు పలువురు కాంగ్రెస్ ఎంపీలు ఇలాగే ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.


ఏదైనా పార్టీకి లోక్ సభ ప్రధాన ప్రతిపక్ష హోదాను పొందాలంటే .. మొత్తం ఉన్న సీట్లలో 10 శాతం గెలవాలి. గత రెండు పర్యాయాలు.. 2014లో 44 స్థానాలు.. 2019లో 52 స్థానాలను మాత్రమే దక్కించుకుంది. దీంతో లోక్ సభలో ప్రతిపక్ష హోదా దక్కలేదు. 2024లో మాత్రం కాంగ్రెస్ పార్టీ 99 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది.


లోక్ సభలో అపోజిషన్ లీడర్ కు   కేంద్ర కేబినేట్ మంత్రితో సరి సమానమైన హోదా ఉంటుంది. అంతేకాదు కేంద్ర మంత్రులతో సమానంగా జీత, భత్యాలు, ఇతర అలవెన్సులు, సౌకర్యాలు ఉంటాయి.అంతేకాదు క్యాబినేట్ మంత్రులకు కేటాయించే సౌకర్యాలుంటాయి. పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా ఉంటారు. పార్లమెంట్ అకౌంట్స్ కమిటి, ఎస్టిమేషన్ కమిటిలకు సభ్యడిగా ఉంటారు. పార్లమెంట్ లో ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించే హక్కు లోక్ సభ ప్రతిపక్ష నేతకు ఉంటుంది. మొత్తంగా ఓ క్యాబినేట్ మంత్రికి ఏయే సౌకర్యాలు.. ప్రొటోకాల్స్ ఉంటాయో.. అవన్నీ ప్రతిపక్ష నేతకు ఉంటాయి.


ప్రస్తుతం లోక్ సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉంటే.. రాజ్యసభలో మల్లిఖార్జున ఖర్గే ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేతగా.. ఇండి కూటమి పార్లమెంటరీ నేతగా సోనియా గాంధీ వ్యవహరించనున్నారు.


Also Read: Hyper Aadi: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను వాడేసుకుంటున్న కమెడియన్ హైపర్ ఆది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter