వివాహమా.. నేను విధినే నమ్ముతాను
పీహెచ్డీ వార్షిక పురస్కారాలు 2017 కార్యక్రమానికి అతిధిగా విచ్చేసిన రాహుల్ గాంధీ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బాక్సర్ విజేందర్ సింగ్ అడిగిన ఓ ప్రశ్నకు గమ్మతైన సమాధానం ఇచ్చారు. "మీ వివాహమెప్పుడవుతుందో తెలుసుకోవచ్చా" అనే ప్రశ్నకు జవాబిస్తూ, అవ్వాల్సిన సమయమొస్తే అవుతుంది, నేను విధినే నమ్ముతాను అని నవ్వుతూ జవాబిచ్చారు. ఈ సమాధానానికి ఎంపీ శశిథరూర్ ట్విట్టర్ వేదికగా బదులిచ్చారు. రాహుల్ గాంధీ విధిని నమ్ముతారు.. అందుకే తాత్కాలిక స్థానంలో సరిగ్గా ఇమిడిపోయారు అని కామెంట్ చేశారు. రాహుల్ గాంధీకి గతంలో కూడా వివాహం గురించి పలువురు ప్రశ్నలు అడిగిన సందర్భాలు ఉన్నాయి. గతంలో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలను బట్టి రాహుల్ వివాహం ఆధారపడి ఉంటుందని తెలిపారు. అలాగే ట్విట్టర్ ద్వారా స్పందనను తెలియజేస్తూ, బుద్దూ త్వరలోనే ఓ యూపీ బ్రాహ్మణ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటారని వార్తలు వస్తున్నాయి.. ఇది మరో ఆసక్తికరమైన స్టంట్ అని స్వామి అభిప్రాయపడ్డారు.