Rahul Gandhi: దేశంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణకు..వ్యాక్సిన్లకు ముడిపెట్టి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ ప్రధాని నరేంద్ర మోదీ (Pm Narendra modi)ఇటీవల కేబినెట్‌ను విస్తరించారు. 43 మంది ఉన్న కేబినెట్‌ను భారీగా విస్తరించి..77కు పెంచారు. ఎన్డీయే రెండవసారి అధికారం చేపట్టిన తరువాత ఏర్పడిన అతిపెద్ద కేబినెట్ ఇది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.కేబినెట్ విస్తరణను(Cabinet Extension), వ్యాక్సినేషన్‌ను ముడిపెట్టి విమర్శలు చేశారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరతపై వ్యాఖ్యలు చేశారు. 


దేశంలో మంత్రుల సంఖ్య పెరిగింది కానీ..కోవిడ్ వ్యాక్సిన్లు పెరగలేదని రాహుల్ గాంధీ(Rahul Gandhi)వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ గణాంకాల్ని కూడా ట్వీట్ చేశారు. రోజుకు సగటు వ్యాక్సిన్ డోసుల్ని వివరిస్తూ..ఇలా అయితే దేశంలో డిసెంబర్ 2021 నాటికి వ్యాక్సినేషన్ (Vaccination)ప్రక్రియ ఎలా పూర్తవుతుందని ప్రశ్నించారు.వేర్ ఆర్ వ్యాక్సిన్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్ మాధ్యమం ద్వారా దాడి ఎక్కుపెట్టారు. దేశంలో వ్యాక్సిన్ల కొరతపై ఇప్పటికే చాలాసార్లు ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ..కరోనా థర్డ్‌వేవ్ (Corona Third Wave) ముప్పు నేపధ్యంలో త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. 


Also read: Corona Spreading Rate: కరోనా సంక్రమణ రేటు ఎంత ఉంది, కరోనా థర్డ్‌వేవ్‌కు ఇదే కారణమా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook