Rahul Gandhi: న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ ఎప్పటిలాగానే తనదైన శైలిలో కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. లడఖ్‌లోని గాల్వన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలో 20మంది భారత సైనికులు అమరులైన నాటినుంచి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు విమర్శిస్తూనే ఉన్నారు. ఆయుధాల్లేకుండా సైనికులను ఎందుకు పంపించారు, భారత్, చైనా సరిహద్దుల విషయంలో వాస్తవాలను ఎందుకు దాస్తున్నారంటూ పలుమార్లు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) శనివారం కూడా ట్వీట్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్రమోడీ (Narendra Modi) ని లక్ష్యంగా చేసుకున్నారు. పీఎం కేర్స్ ఫండ్‌ (PM CARES Fund) కు చైనా కంపెనీల నుంచి వచ్చిన విరాళాల వివరాలను పంచుకోవడానికి ఎందుకు భయపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


‘‘పీఎం కేర్స్‌ ఫండ్‌కు నగదు విరాళంగా ఇచ్చిన వారి పేర్లను వెల్లడించడానికి ప్రధానమంత్రి ఎందుకు భయపడుతున్నారు.. చైనా కంపెనీలైన హువావే, షియోమి, టిక్‌టాక్, వన్‌ప్లస్ నగదు ఇచ్చాయని అందరికీ తెలుసు. అలాంటప్పుడు ఎందుకు వివరాలను పంచుకోరు.’’ అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. 


Also read: Pulwama like attack: మరో భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర.. రెక్కీ పూర్తి


అదేవిధంగా కాంగ్రెస్ ఎంపీలతో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. జాతీయ భద్రత లేదా సరిహద్దులను బలహీనపరిచే ఉద్దేశ్యాలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వదని స్పష్టంచేశారు.  ప్రధాని నరేంద్ర మోడీ అబద్ధాలు చెబుతూ దేశాన్ని దేశాన్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు.  భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకోకుండా తీసుకున్న చర్యలను తెలియజేయాలని, చైనా చోరబాట్లు, ఆక్రమణలను గుర్తించడానికి స్వతంత్ర కమిటీ ఏర్పాటుచేయాలని రాహుల్ గాంధీ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. Also read: Vikas Dubey encounter: మౌనమే మేలు: రాహుల్ గాంధీ