ముంబై: శివ సేన అధినేత ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారోత్సవం చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ రాహుల్ గాంధీ ఓ లేఖ రాశారు. ప్రజాస్వామ్యాన్ని తక్కువ అంచనా వేసిన బీజేపిని ఓడించేందుకు మహారాష్ట్ర వికాస్ అఘాడి ఒక్కతాటిపైకి రావడం తనకు ఎంతో సంతోషాన్నించిందని ఆయన ఆనందం వ్యక్తంచేశారు. అయితే, అదే సమయంలో తాను అక్కడికి రాలేకపోయినందుకు కొంత చింతిస్తున్నాను అని రాహుల్ గాంధీ తన లేఖలో పేర్కొన్నారు. శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP), కాంగ్రెస్ పార్టీ కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ థాకరే ప్రమాణస్వీకారం.. వెంటనే కేబినెట్ భేటీకి రెడీ


ముంబైలోని శివాజీ పార్కులో శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా ఆ తర్వాత శివసేన అగ్రనేత ఏక్‌నాథ్ శంబాజీ షిండే,  సుభాష్ దేశాయ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) నుంచి జయంత్ పాటిల్, చగన్ చంద్రకాంత్ భుజ్‌బల్, కాంగ్రెస్ పార్టీ నుంచి బాలాసాహెబ్ థోరట్, నితిన్ రావత్ వంటి నేతలు ఉద్ధవ్ థాకరే కేబినెట్‌లో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం చేసిన వెంటనే నేడు రాత్రి 8 గంటలకు కొత్త కేబినెట్ భేటీ కానుందని ప్రమాణస్వీకారం ముంటే ఉద్ధవ్ థాకరే ప్రకటించారు. 


Read also : ఆ తర్వాతే అజిత్ పవార్ చేత ప్రమాణ స్వీకారం: శరద్ పవార్


ఉద్దవ్ థాకరే ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన వారిలో కొంత మంది ప్రముఖుల వివరాలు:
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే ప్రమాణస్వీకారోత్సవానికి మాజీ ముఖ్యమంత్రి, బీజేపి నేత దేవేంద్ర ఫడణవిస్ కూడా హాజరయ్యారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబాని తన సతీమణి నీతా అంబాని, తనయుడు అనంత్ అంబానీలతో కలిసి ఈ వేడుకకు విచ్చేశారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి దాదాపు కీలక నేతలు అందరూ ఉద్ధవ్ థాకరే ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు. మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన(MNS) రాజ్ థాకరే, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, ఆ పార్టీ నేత టీఆర్ బాలు ఈ వేడుకకు హాజరై థాకరేకు శుభాకాంక్షలు తెలిపారు.