'రాజ్యాంగాన్ని కాపాడండి' పేరిట ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన ఓ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ  ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ మోడీ నిర్వీర్యం చేస్తున్నారని.. ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ ఎంపీలను కూడా మాట్లాడించేందుకు మోడీ సిద్ధంగా లేరని విమర్శించారు. మోడీ తన మనసులో మాటను మాత్రమే వినాలనే ధోరణితో ఉన్నారని  రాహుల్ విమర్శలు సంధించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా   'బేటీ బచావో' నినాదానికి రాహుల్ గాంధీ  సరికొత్త కొత్త నిర్వచనం ఇచ్చారు. 'ఆడపిల్లల్ని కాపాడండి... బీజేపీవాళ్ల నుంచి రక్షించండి' అని చెప్పిన రాహుల్...ఇక నుంచి ఇదే తమ సరికొత్త నినాదమని తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ కీలకమైన పదవుల్లో ఆరెస్సెస్ కు చెందిన వారిని కట్టబెడుతూ రాజ్యాంగబద్ధమైన సంస్థలను మోదీ ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులను మోదీకి చిన్న చూపుతో చూస్తున్నారని ఆరోపించారు. దళితుల ప్రయోజనాలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని రాహుల్ పేర్కొన్నారు.